Vijayasai Reddy Meets Sajjala : విజయసాయిరెడ్డి కొత్త లుక్.. తొలిసారి సజ్జల ఇంటికి

ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఇంటికి తొలిసారిగా రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి వెళ్లారు. వైసీపీలో కీలక నేతలుగా గుర్తింపు పొందిన ఈ ఇద్దరూ..

Vijayasai Reddy Meets Sajjala : ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఇంటికి తొలిసారిగా రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి వెళ్లారు. వైసీపీలో కీలక నేతలుగా గుర్తింపు పొందిన ఈ ఇద్దరూ కీలక అంశాలపై చర్చలు జరుపుతున్నారు.

జగన్ ఆదేశాలతో సజ్జల, విజయసాయిరెడ్డి రంగంలోకి దిగారు. 151 మంది ఎమ్మెల్యేలు, 24 మంది నియోజకవర్గ ఇంఛార్జిలతో రోజూ సజ్జల టచ్ లో ఉంటుండగా.. 26 జిల్లాల అధ్యక్షులతో విజయసాయిరెడ్డి నిత్యం మంతనాలు జరుపుతున్నారు. ఇద్దరు నేతలూ రోజూ టెలికాన్ఫరెన్స్ లు నిర్వహిస్తున్నారు. ఈ నెల 10 నుంచి గడప గడపకి వైసీపీ కార్యక్రమంపైన ఫోకస్ పెట్టింది వైసీపీ అధిష్టానం.

Chandrababu Naidu: ‘క్విట్ ఇండియా ఉద్యమం లాగే క్విట్ జగన్ ఉద్యమం చేపట్టాలి’ : చంద్రబాబు

కాగా, విజ‌య‌సాయిరెడ్డి కొత్త లుక్‌లో క‌నిపించారు. ఆయ‌న గుండు లుక్ లో కనిపించారు. ఇలా గుండు చేయించుకున్న లుక్కులో విజ‌య‌సాయిరెడ్డి ఇప్ప‌టిదాకా ఎప్పుడూ క‌నిపించ‌లేదు. ఈ లుక్కులో విజ‌య‌సాయిరెడ్డి ఫొటో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

AP politics : జనసేనకు ఫ్రీ పబ్లిసిటీ ఇస్తున్న పార్టీలు..దోస్తీ కోసం టీడీపీ, బీజేపీ ప్రయత్నాలు

స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డితో భేటీకి సంబంధించిన విష‌యాన్ని స్వ‌యంగా విజ‌య‌సాయిరెడ్డి ట్విట్ట‌ర్ వేదిక‌గా తెలిపారు. స‌జ్జ‌ల‌తో తాను భేటీ అయిన ఫొటోను ఆయ‌నే ట్వీట్‌ చేశారు.

విజయసాయిరెడ్డి, సజ్జల రామకృష్ణా రెడ్డి ఇద్దరూ వైసీపీలో కీలక నేతలే. తొలిసారిగా విజయసాయిరెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి ఇంటికి వెళ్లి చర్చలు జరపడం ఆసక్తి రేపుతోంది. కీలక అంశాలపై వీరు చర్చించారు. అలాగే, సీఎం జగన్ అప్పగించిన కీలక బాధ్యతలపైనా ఇరువురూ డిస్కస్ చేశారు. పార్టీ జిల్లా అధ్యక్షులు, పార్టీ రీజనల్ అధ్యక్షుల కో-ఆర్డినేషన్ బాధ్యతలను కొన్నిరోజుల క్రితమే విజయసాయిరెడ్డికి బదిలీ చేస్తూ సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. అప్పటి నుంచి సజ్జల, విజయసాయిరెడ్డి రంగంలోకి దిగారు. సీఎం జగన్ తనకు బాధ్యత అప్పగించడంతో.. ఎమ్మెల్యేల కోఆర్డినేషన్ లో సజ్జల బిజీగా ఉన్నారు. ప్రతిరోజూ అంశాల వారిగా టెలీకాన్ఫరెన్స్ లు నిర్వహిస్తున్నారు.

అటు విజయసాయిరెడ్డి ప్రతిరోజూ జిల్లా అధ్యక్షులతో టచ్ లో ఉంటున్నారు. టెలీ, వీడియో కాన్ఫరెన్స్ లు నిర్వహిస్తున్నారు. పార్టీ కార్యక్రమాలకు సంబంధించి ఎప్పటికప్పుడు సమీక్ష జరుపుతున్నారు. ఈ నెల 10 నుంచి గడప గడపకు వైసీపీ కార్యక్రమం ప్రారంభం కానుంది. దీన్ని సీఎం జగన్ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. దీంతో ఆ కార్యక్రమాన్ని ఎలా విజయవంతం చేయాలి, ఎలా ప్రజల్లోకి తీసుకెళ్లాలి అనే అంశాలపై ఈ ఇద్దరు కీలక నేతలు చర్చించారు.

కాగా, కొన్ని రోజులుగా కేవలం ఉత్తరాంధ్రకే పరిమితం అయిన విజయసాయిరెడ్డి.. ఇప్పుడు పార్టీలో పూర్తిగా యాక్టివ్ అయ్యారు. ఈ క్రమంలో తొలిసారి సజ్జల ఇంటికెళ్లి ఆయనతో భేటీ కావడం కీలక పరిణామంగా చెప్పుకోవచ్చు. వీరిద్దరూ కలిసి పార్టీని బలోపేతం చేయడం, అలాగే పార్టీ కార్యక్రమాలను కలసి చేసే ఒక మెసేజ్ ను పార్టీ కేడర్ కి ఇచ్చినట్లుగా తెలుస్తుంది.

ట్రెండింగ్ వార్తలు