AP politics : జనసేనకు ఫ్రీ పబ్లిసిటీ ఇస్తున్న పార్టీలు..దోస్తీ కోసం టీడీపీ, బీజేపీ ప్రయత్నాలు

AP politics : జనసేనకు ఫ్రీ పబ్లిసిటీ ఇస్తున్న పార్టీలు..దోస్తీ కోసం టీడీపీ, బీజేపీ ప్రయత్నాలు

Janasena Party

AP politics : ఓట్ బ్యాంక్ లేదు.. సీట్ షేరింగ్ లేదు.. స్టేట్‌లో పెద్దగా కేడర్ కూడా లేదు. ఆ పార్టీ పేరెత్తగానే.. ఠక్కున గుర్తొచ్చే ఇద్దరు లీడర్లు తప్ప.. చెప్పుకోవడానికి.. జనానికి చూపించడానికి నేమ్.. ఫేమ్.. ఉన్న నాయకులే లేరు. అయినా.. ఆ పార్టీ చాలా లక్కీ. విమర్శించడానికైనా.. జత కట్టడానికైనా.. మద్దతుకోసమైనా.. రాష్ట్రంలోని మిగతా పార్టీలకు.. ఆ పార్టీయే కావాలి. అదే.. జనసేన. డైరెక్ట్‌గానో.. ఇన్‌డైరెక్ట్‌గానో.. ఏపీలోని 3 పార్టీలు.. జనసేనకు సపోర్ట్ చేస్తున్నాయనే టాక్ మొదలైంది. మరి.. ఈ టైపు టాక్ ఎందుకు నడుస్తోంది.

ప్రశ్నించడం కోసమే పుట్టిన జనసేన.. ఎవరిని ప్రశ్నించిందో.. ఎప్పుడు ప్రశ్నించిందోనన్న విషయాలను పక్కనబెడితే.. ఆ పార్టీ చాలా లక్కీ అనే టాక్ మాత్రం ఇప్పుడు వినిపిస్తోంది. పాజిటివ్‌గానో.. నెగటివ్‌గానో.. ఏదో రకంగా.. ఈ ఒక్క పార్టీని.. మిగతా మూడు పార్టీలు మోసేస్తున్నాయ్.

జనసేనను, ఆ పార్టీ నాయకులను ఇష్టమొచ్చినట్లు విమర్శిస్తూ వస్తోంది అధికార వైసీపీ. దీంతో.. జనంలో జనసేనపై చర్చ సాగుతోంది. ఇక.. ఎప్పుడెప్పుడు ఆ పార్టీతో పొత్తు పెట్టుకుందామా? అని ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం ఎదురుచూస్తోంది. ఇందుకోసం.. ఇన్ డైరెక్ట్‌గా జనసేనను సపోర్ట్ చేస్తోంది. వీలు చిక్కినప్పుడల్లా.. టీడీపీ నేతలు జనసేనానికి ప్రత్యేకంగా పొగిడేస్తున్నారు. ఇక.. మరో పార్టీ బీజేపీ. వీళ్లైతే.. టైం దొరికినప్పుడల్లా.. జనసేన భజన చేసేస్తున్నారు. ఏపీలో జనసేనే నెంబర్ వన్ అని.. ఆకాశానికెత్తేస్తున్నారు. ఇలా.. అన్ని పార్టీలు.. జనసేనను ప్రమోట్ చేయడమంటే.. నిజంగా.. అది లక్కీ పార్టీయే అని రాజకీయవర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఏదో రకంగా.. జనంలోకి జనసేన పేరు వెళుతోందని చర్చించుకుంటున్నారు.

నిజానికి.. ఏపీలో జనసేనకు పెద్దగా కేడర్ లేదు. గ్రామస్థాయి నుంచి నగరం దాకా.. చెప్పుకోదగ్గ లీడర్లు లేరు. బూత్ లెవెల్లోనూ.. పార్టీ అంత పటిష్టంగా ఏమీ లేదు. ఆ పార్టీకి ఉన్న ఏకైక బలం.. సామాజికపరమైన అంశమే. ఇదొక్కటే.. జనసేనకు.. సేనానికి.. జేజేలు కొట్టిస్తుందనే టాక్ వినిపిస్తోంది. వైసీపీలో ఉన్న కాపు నేతలంతా.. దమ్ముంటే ఒంటరిగా పోటీ చేసి గెలవాలని జనసేనకు సవాళ్లు విసురుతున్నారు. ఎందుకంటే.. పవన్ పార్టీ ఒంటరిగా పోటీ చేస్తేనే వాళ్లకు లాభం కలుగుతుందనే అంచనాలున్నాయ్.

ఇక.. వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తే మళ్లీ కష్టాలు తప్పవని టీడీపీ నాయకత్వం భావిస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయ్. అందువల్ల.. జనసేనతో కలిసి వెళ్లడం వల్ల.. ఆ పార్టీకి ఉండే ఐదారు శాతం ఓట్ బ్యాంక్.. తమ వైపు మళ్లితే.. ఈజీగా అధికారంలోకి రావొచ్చని లెక్కలేసుకుంటున్నారు. బీజేపీ విషయానికొస్తే.. ఆ పార్టీకి ఒక్క శాతం ఓట్ షేర్ కూడా లేదు. ఈసారి.. ఆ ఒక్క శాతం కూడా రాకపోతే.. హైకమాండ్ ఏపీ నేతలకు అపాయింట్‌మెంట్ ఇచ్చే పరిస్థితి కూడా ఉండదనే చర్చ సాగుతోంది. అందుకే.. కాస్త బరువైనా జనసేనను మోస్తున్నారని.. దాంతో.. కాషాయం పార్టీకి ఓట్లు పెంచుకోవచ్చనే.. భావనలో ఉన్నట్లు.. అంతా చెప్పుకుంటున్నారు.

ప్రస్తుతం.. ఏపీలో ఉన్న ప్రతిపక్ష పార్టీల్లో.. జనసేన కొంత పోటీ ఇవ్వొచ్చని.. వైసీపీ భావిస్తున్నట్లు.. పరిస్థితులు చూస్తే అర్థమవుతోంది. అలాగే.. బీజేపీ, టీడీపీ కూడా.. తమకంటే జనసేనే కాస్త బెటర్ పొజిషన్‌లో ఉందని నమ్ముతున్నారు. అందువల్ల.. పవన్ పార్టీతో దోస్తీ కుదిరితే.. వచ్చే ఎన్నికల్లో ఎక్కువ సీట్లు గెలవొచ్చనే అంచనాల్లో ఉన్నారు. ఏదేమైనా.. పది మంది బలమైన నాయకులు కూడా లేని జనసేన కోసం.. మిగతా పార్టీలు ఇంతలా ఆలోచించడం, ఆశలు పెట్టుకోవడం, టార్గెట్ చేయడం లాంటివి చూస్తుంటే.. నిజంగా.. ఆ పార్టీకి ఎన్ని టన్నుల అదృష్టం కలిసొచ్చిందోనన్న చర్చ జరుగుతోంది.