MRPS : వేదికపై ప్రసంగిస్తుండగా గుండెపోటు.. ఎమ్మార్పీఎస్‌ నేత మృతి

మాదిగ రిజర్వేషన్‌ పోరాట మితి (ఎమ్మార్పీఎస్‌) పొలిట్‌ బ్యూరో సభ్యుడు పెద్దాడ ప్రకాశరావు గుండెపోటుకు గురై మరణించారు.

Mrps

MRPS : మాదిగ రిజర్వేషన్‌ పోరాట మితి (ఎమ్మార్పీఎస్‌) పొలిట్‌ బ్యూరో సభ్యుడు పెద్దాడ ప్రకాశ్ రావు గుండెపోటుకు గురై మరణించారు. విశాఖపట్నం జిల్లా చోడవరం అంబేద్కర్‌ భవనంలో మాడుగుల నియోజకవర్గాల ఎమ్మార్పీఎస్‌ కార్యకర్తల సభ నిర్వహించారు. శనివారం రాత్రి జరిగిన ఈ సమావేశానికి ప్రకాశరావు హాజరయ్యారు. సభను ఉద్దేశించి ప్రసంగిస్తూ సభావేదికపై కుప్పకూలిపోయారు.

చదవండి : MRPS సభ నిర్వహణకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్

నాయకులు, కార్యకర్తలు వెంటనే అతనిని అంబులెన్స్‌లో విశాఖపట్నం ఆస్పత్రికి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. మృతదేహాన్ని ఆయన స్వగ్రామం కంచరపాలేనికి తరలించారు. ప్రకాశరావు మృతిపై ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ దిగ్బ్రాంతి వ్యక్తం చేశాడు. ప్రకాశరావు మృతి ఎమ్మార్పీఎస్‌ తీరని లోటని అన్నారు.

చదవండి : Papikondalu : బోట్ల షికారు అంతా శుభం జరగాలి – మంత్రి అవంతి శ్రీనివాస్