Tooth Decay : దంతాలు పుచ్చకుండా సరికొత్త చికిత్స

రోజుకి రెండుసార్లు బ్రష్‌ చేసినా తీపి పదార్థాలు తినకున్నా కొందరికి తరచూ పాచి పేరుకుంటుంది. విటమిన్ డి తక్కువవారిలో కీళ్ళ నొప్పులతో పాటు, పళ్లు పుచ్చిపోతాయి.

Tooth Decay : దంతాలు పుచ్చకుండా సరికొత్త చికిత్స

Teath

Tooth Decay : ప్రతిరోజు సరిగా దంతాలను శుభ్రం చేయకపోవడం వల్లే పళ్లు పుచ్చిపోతాయని భావిస్తారు. అయితే ఇది ఒక కారణం కావొచ్చు…దంతాలు పుచ్చిపోవడానికి చాలా కారణాలే ఉన్నాయి. ముఖ్యంగా బాగా చాక్లెట్లు ఆరగించే అలవాటున్న చిన్నారుల్లో దంతాలు సులభంగా పుచ్చుపడతాయి. రోజుకి రెండుసార్లు బ్రష్‌ చేసినా తీపి పదార్థాలు తినకున్నా కొందరికి తరచూ పాచి పేరుకుంటుంది. విటమిన్ డి తక్కువవారిలో కీళ్ళ నొప్పులతో పాటు, పళ్లు పుచ్చిపోతాయి. డీ హైడ్రేష‌న్ వ‌ల్ల శ‌రీరం ఎండిపోవ‌డ‌మేకాకుండా నోరు కూడా ఎండిపోతుంది. ఇలానే ఎక్కుసేపు ఉండ‌డం వ‌ల్ల కూడా దంతాలు పుచ్చిపోతాయి. జీర్ణ సమస్యలు ఉంటే దంత సమస్యలు ఏర్పడతాయి.

ఇలాంటి సందర్భాల్లో దంతాల్లోకి హానికర బ్యాక్టీరియా చేరి రంధ్రాలు ఏర్పడేలా చేస్తుంది. అప్పుడు ఆ రంధ్రాలకు ఫిల్లింగ్‌ లేదా రూట్‌కెనాల్‌ చికిత్సలు చేయించుకోవడం తప్ప మరో ప్రత్యామ్నాయం లేదు. అయితే తరచూ క్యావిటీలు వచ్చేవాళ్లకోసం పెన్సిల్వేనియా, ఇండియానా యూనివర్సిటీల నిపుణులు ఓ సరికొత్త చికిత్సని రూపొందించారు. ఐరన్‌ ఆక్సైడ్‌ నానోజైమ్స్‌ అనే సన్నని రేణువులు క్యావిటీలకు కారణమైన బ్యాక్టీరియాని సమర్థంగా నాశనం చేస్తాయని నిర్ధారణకు వచ్చారు.

ఇందుకోసం ముందుగా హైడ్రోజన్‌ పెరాక్సైడ్‌తో పుక్కిలించేలా చేసి ఆపై ఫెరుమాక్సిటాల్‌ అనే ద్రావణాన్ని దంతాల్లోకి చొప్పిస్తారు. ఆసమయంలో ఐరన్‌-ఆక్సైడ్‌ రేణువులు దంతాలను నాశనం చేసే స్ట్రెప్టోకాకస్‌ మ్యుటాన్స్‌ అనే బ్యాక్టీరియా కణాల్లోకి చొచ్చుకుపోయి వాటిని నాశనం చేశాయట. అదెలాగో పరిశీలిస్తే  ఈ ఐరన్‌ ఆక్సైడ్‌ రేణువులు ముందుగా పుక్కిలించిన హైడ్రోజన్‌ పెరాక్సైడ్‌తో చర్యపొంది ఆక్సిడెంట్లు విడుదలయ్యేలా చేయడం ద్వారా హానికర బ్యాక్టీరియాని నాశనం చేస్తాయి. పదిహేను మందిలో ఈ విధానాన్ని పరిశీలించినప్పుడు- దంతాల్లోకి బ్యాక్టీరియా చేరడం చాలావరకూ తగ్గిందట. కాబట్టి దంత సమస్యలున్నవాళ్లు ఈ సరికొత్త చికిత్సా విధానం ద్వారా వాటిని నిరోధించుకోవచ్చు అంటున్నారు. అయితే ఈ పరిస్ధితి రాకుండా ఉండాలంటే దంతాల విషయంలో జాగ్రత్తలు పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు.