MSK Prasad : స్కూల్ కూల్చేస్తారా?.. సీఎం జగన్‌కు MSK ప్రసాద్ లేఖ

ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి మాజీ క్రికెటర్ ఎమ్మెస్కే ప్రసాద్ లేఖ రాశారు. విశాఖలో మానసిక వికలాంగుల స్కూల్ కూల్చివేతపై సీఎంకు లేఖ రాశారు. స్కూల్ కూల్చివేత ఘటన దారుణమన్నారు.

Msk Prasad

MSK Prasad Letter to CM Jagan : ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి మాజీ క్రికెటర్ ఎమ్మెస్కే ప్రసాద్ లేఖ పంపారు. విశాఖలో మానసిక వికలాంగుల స్కూల్ కూల్చివేతపై ఆయన స్పందించారు. స్కూల్ కూల్చివేత ఘటన దారుణమన్నారు.140 మంది మానసిక వికలాంగులైన చిన్నారులు అక్కడ ఆశ్రయం పొందుతున్నారని తెలిపారు.

ఇలాంటి చర్య సరికాదన్నారు. అలాంటి పాఠశాలను కూల్చివేయాలని జివిఎంసి అధికారులు తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరారు. స్కూల్ తిరిగి ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ ను ఎమ్మెస్కే కోరారు. విశాఖలో మానసిక వికలాంగులకు చదువుకునే పాఠశాలను జీవీఎంసీ అధికారులు కూల్చివేసిన సంగతి తెలిసిందే.