పడక సుఖం కోసం అడ్డదారులు తొక్కుతున్న కొందరు ఎంతటి దారుణాలకైనా పాల్పడుతున్నారు. అక్రమ సంబంధాల మోజులో పడి జీవితాలను బలి చేసుకుంటున్నారు. ఇద్దరు ప్రియులతో రాసలీలలు సాగినంత కాలం సాగించి ఒక ప్రియుడిని వదిలించుకునేందుకు మరోక ప్రియుడితో కలిసి కుట్ర పన్నింది ఒక వగలాడి.
కడప జిల్లా ముద్దనూరు మండలం బందలకుంట గ్రామానికి చెందిన నాగేష్ భవన నిర్మాణ కార్మికుడు. ఇతనితో పాటు ఎర్రగుంట్ల మండలం చిలమకూరు గ్రామానికి చెందిన వరలక్ష్మి కూడా భవన నిర్మాణ పనులకు వెళ్తూ ఉండేది. వీరిద్దరూ బేల్దారి పనులు కలిసి చేస్తుండేవారు. ఈక్రమంలో వీరిద్దరి మధ్య అక్రమ సంబంధం ఏర్పడింది. ఆ బంధంతో చాలా కాలంగా రాసలీలలు సాగిస్తూ ఎంజాయ్ చేస్తున్నారు.
అయితే ఇటీవల కాలంలో వరలక్ష్మి నాగేష్ ను దూరం పెట్టసాగింది. అనుమానం వచ్చిన నాగేష్ వరలక్ష్మిని గట్టిగా అడిగాడు. వాస్తవానికి నాగేష్ తో వ్యవహారం సాగిస్తూనే వరలక్ష్మి ముద్దనూరు లోని కొలవలి కి చెందిన వెంకట గంగాధర్ తోనూ అక్రమ సంబంధం పెట్టుకుంది.
ఒకరికి తెలియకుండా ఒకరితో వ్యవహరిస్తూ ఇద్దరితోనూ ఆమె రాసలీలలు సాగించింది. ఈ క్రమంలో తనను దూరం పెడుతోందని గమనించిన నాగేష్ వరలక్ష్మి ని గట్టిగా నిలదీశాడు. అప్పటికి వరలక్ష్మి అతనికి సమాధానం ఇవ్వకుండా దాటవేసింది.
ఇది మనసులో పెట్టుకున్న వరలక్ష్మి రెండో ప్రియుడు గంగాధర్ తో మొదటి ప్రియుడు నాగేష్ ను అడ్డు తొలగించు కోవాలనుకుంది. ఇద్దరూ కల్సి పధకం రచించారు. తనపై కోపం పెంచుకున్న నాగేష్ కు వలపు వల విసిరింది. మార్చి 27 న… తాను కడపలో ఉన్నానని…అక్కడ్నించి తీసుకువెళ్తే ఎక్కడైనా ఎంజాయ్ చేద్దామని ప్రేమగా చెప్పింది.
కడప వెళ్లిన నాగేష్ ఆమెను బైక్ పై ఎక్కించుకుని పెండ్లి మర్రి సమీపంలోని దాసరిపల్లె మామిడి తోటలోకి వెళ్లాడు. ముందుగా అనుకున్న ప్రకారం రెండో ప్రియుడు గంగాధర్ వీరిని ఫాలో అవుతూ వచ్చాడు. వరలక్ష్మి నాగేష్ లు మామిడి తోటలో ఏకాంత ప్రదేశంలోకి వెళ్ళగానే… వెనకనే వచ్చిన గంగాధర్ నాగేష్ మెడకు టవల్ బిగించాడు. పక్కనే ఉన్న వరలక్ష్మి నాగేష్ కు ఊపిరాడకుండా చేసి దారుణంగా హత్య చేసింది.
అనంతరం అతని ఒంటిమీద ఉన్న బంగారు గొలుసు, ఉంగరాన్ని తీసుకుని అక్కడి నుంచి ఇద్దరూ పరారయ్యారు. మామిడి తోటలో మృతదేహాన్ని గుర్తించిన స్ధానికులు ముద్దనూరు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్ధలానికి చేరుకున్న పోలీసులు శవాన్ని పోస్టు మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
ఘటనా స్ధలంలో ఎటువంటి ఆనవాళ్లు దొరక్కపోవటం….శరీరంపై పెద్దగా గాయాలులేకపోవటంతో… దారి దోపిడీ దొంగల పనిగా భావించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. నాగేష్ వృత్తి వివరాల కోణంలో దర్యాప్తు చేపట్టిన పోలీసులు వరలక్ష్మిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించటంతో కిలాడీ లేడీ చేసిన ఘాతుకం బయట పడింది.
ఒకడితో గుట్టుగా సాగుతున్న అక్రమ సంబంధం కొనసాగించక, మోజు తీరక రెండో ప్రియుడ్ని ఎంచుకుని… అతడి మోజులో మొదటి ప్రియుడ్ని హత్య చేశానని ఒప్పుకోవటంతో పోలీసులు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.