పద్మనాభ రెడ్డిగా పేరు మార్చుకుంటా.. జగన్ విషయంలో మాత్రం బాధగాఉంది : ముద్రగడ

నేను ఇచ్చిన సవాల్ ను స్వీకరిస్తానని చెప్పిన ముద్రగడ.. నా పేరు పద్మనాభరెడ్డిగా ..

Mudragada Padhmanabham

Mudragada Padhmanabham : ఏపీ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పుపై మాజీ మంత్రి, వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జనంకోసం కష్టపడిన జగన్ మోహన్ రెడ్డిని ప్రజలు గౌరవించకపోవడం బాధాకరం, జగన్ సంక్షేమ కార్యక్రమాలను ఎందుకు ఆదరించలేదో తెలియడం లేదని ముద్రగడ పద్మనాభం అన్నారు. నా రాజకీయ ప్రయాణం జగన్ తోనే కొనసాగుతుందని చెప్పారు.

Also Read : పాలకుడనే వాడు ఎలా ఉండకూడదో జగన్ చూపించాడు.. ఎన్డీయేలో కొనసాగే విషయంపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

పిఠాపురంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను ఓడించకపోతే తన పేరు మార్చుకుంటానని ముద్రగడ పద్మనాభం ఎన్నికల ముందు సవాల్ చేసిన విషయం తెలిసిందే. ఆ విషయంపై ముద్రగడ స్పందించారు. నేను ఇచ్చిన సవాల్ ను స్వీకరిస్తానని చెప్పిన ముద్రగడ.. నా పేరు పద్మనాభరెడ్డిగా మార్చమని గెజిట్ పబ్లికేషన్ కోసం పేపర్లు రెడీ చేసుకున్నానని చెప్పారు. నా సవాలులో నేను ఓడిపోయాను. కాబట్టి నాపేరు మార్చుకోవడానికి సిద్ధమవుతున్నానని అన్నారు. ఎన్నికల్లో విజయం సాధించిన కూటమికి ముద్రగడ శుభాకాంక్షలు చెప్పారు.

Also Read : చంద్రబాబుతో సీఎస్ భేటీ.. బాబు నివాసానికి క్యూకట్టిన ఎంపీలు, ఎమ్మెల్యేలు