చంద్రబాబుతో సీఎస్ భేటీ.. బాబు నివాసానికి క్యూకట్టిన ఎంపీలు, ఎమ్మెల్యేలు
ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కూటమి అద్భుత విజయాన్ని అందుకుంది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నాల్గోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

Chandrababu
Chandrababu Naidu : ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కూటమి అద్భుత విజయాన్ని అందుకుంది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నాల్గోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. చంద్రబాబును కలిసేందుకు బుధవారం ఉదయం ఆయన నివాసానికి ప్రభుత్వ ఉన్నతాధికారులు, గెలిచిన ఎమ్మెల్యేలు, ఎంపీలు చేరుకున్నారు. చంద్రబాబు కు శుభాకాంక్షలు తెలిపేందుకు వచ్చిన వారిలో ధూళిపాళ్ల నరేంద్ర, పెమ్మాసాని చంద్రశేఖర్, మాజీ ఎంపీ గల్లా జయదేవ్, జూలకంటి బ్రహ్మనంద రెడ్డి, అయితాబత్తుల ఆనందరావు, బోడె ప్రసాద్, అనగాని సత్యప్రసాద్, కేశినేని చిన్నీ, బోండా ఉమా, డోలా బాలవీరాంజనేయ స్వామి తదితరులు ఉన్నారు.
Also Read : కూటమి అధికారంలోకి.. సెలవుపై విదేశాలకు సీఐడీ అడిషనల్ డీజీ సంజయ్
బాబుతో సీఎస్ భేటీ..
సీఎస్ జవహర్ రెడ్డి, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా చంద్రబాబు నివాసానికి వెళ్లి భేటీ అయ్యారు. సీఎస్ తో చంద్రబాబు భేటీ సుమారు అర్ధగంటపాటు సాగింది. పలు అంశాలపై సీఎస్ నుంచి చంద్రబాబు వివరాలు తెలుసుకున్నారు. చంద్రబాబును కలిసేందుకు ఆయన నివాసానికి వెళ్లిన అధికారుల్లో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్, తదితరులు ఉన్నారు.