వైసీపీలోకి ముద్రగడ..? పిఠాపురంలో శరవేగంగా మారుతున్న రాజకీయ పరిణామాలు

మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం వైసీపీలో చేరి పిఠాపురం నుంచి పోటీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ముద్రగడ పోటీ చేస్తారా లేక ముద్రగడ కుటుంబం నుంచి ఎవరైనా బరిలోకి దిగుతారా అనేది ఆసక్తికరంగా మారింది.

Mudragada Padmanabham

Pithapuram Politics : మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధమైందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. పిఠాపురం నియోజకవర్గంలో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. వైసీపీ పిఠాపురం ఇంచార్జిగా వంగా గీతాను వైసీపీ అధిష్టానం నియమించిన విషయం తెలిసిందే. తాజాగా మారుతున్న రాజకీయ సమీకరణాల్లో భాగంగా ఆమెను ఇంచార్జి బాధ్యతల నుంచి తప్పించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే సీఎంవో కార్యాలయం నుంచి ఆమెకు పిలుపు రావడంతో హుటాహుటీన ఆమె తాడేపల్లికి బయలుదేరి వెళ్లారు.

Also Read : చీపురుపల్లి నియోజకవర్గం టీడీపీలో ట్విస్ట్.. మళ్లీ రంగంలోకి నాగార్జున!

మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం వైసీపీలో చేరి పిఠాపురం నుంచి పోటీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ముద్రగడ పోటీ చేస్తారా లేక ముద్రగడ కుటుంబం నుంచి ఎవరైనా బరిలోకి దిగుతారా అనేది ఆసక్తికరంగా మారింది. జనసేన అధినేత పవన్ కల్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తారని ఊహాగానాల నేపథ్యంలో పవన్ కల్యాణ్ పై ముద్రగడను పోటీలో నిలిపేందుకు అధికార పార్టీ ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. అయితే, గాజువాకలో కూడా పవన్ మరోసారి రీసర్వే చేయిస్తున్నట్లు తెలిసింది. మరోవైపు సీటుపై క్లారిటీ లేక అసంతృప్తితో ఉన్న మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మను కూడా అధికార పార్టీలో కి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం. ఇప్పటికే జిల్లాకు చెందిన అధికార పార్టీ నేతలు వర్మకు టచ్ లోకి వెళ్లినట్లు తెలిసింది. అయితే, నాది గెలిచే సీటు.. నాకు చంద్రబాబు నాయుడు కచ్చితంగా అవకాశం ఇస్తారని వర్మ అధికార పార్టీ పెద్దలకు సమాధానం ఇచ్చినట్లు సమాచారం.

Also Read : టీడీపీ-జనసేన కూటమితో పొత్తు, పోటీ చేసే స్థానాలపై క్లారిటీ ఇవ్వనున్న బీజేపీ

ముద్రగడ కొడుకు గిరిని పిఠాపురం నుంచి పోటీ చేసేందుకు వైసీపీ అధిష్టానం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. మరోవైపు.. వంగా గీత పిఠాపురం నుంచి తప్పిస్తే ఆమెను ఎక్కడ నుంచి బరిలోకి దింపుతారనే అంశం చర్చనీయాంశంగా మారింది. 2009లో పిఠాపురం నియోజకవర్గం నుంచి మూడు వేరువేరు పార్టీల నుండి ముద్రగడ, వర్మ, గీత ముగ్గురు బరిలో ఉన్నారు. ప్రస్తుతం ఈ ముగ్గురిని ఒకే పార్టీలోకి తీసుక్చొచే వ్యూహంతో వైసీపీ అధిష్టానం పనిచేస్తున్నట్లు సమాచారం.

 

ట్రెండింగ్ వార్తలు