×
Ad

Ugadi 2021 : ఉగాది పండుగ, వెంకన్నను అల్లుడిగా భావించే ముస్లింలు..ప్రత్యేక పూజలు

ఉగాది పండుగ వచ్చిందంటే..చాలు..ఏపీ రాష్ట్రంలోని కడప జిల్లా గుర్తుకు వస్తుంది. ఈ పండుగను ముస్లింలు కూడా జరుపుకుంటుంటారు.

  • Published On : April 10, 2021 / 01:34 PM IST

Ugadi

Muslims Kadapa Sri Venkateswara temple offer prayers : ఉగాది పండుగ వచ్చేస్తోంది. ఈ ఉగాది ఒక్క తెలుగువారే కాకుండా దక్షిణాది రాష్ట్రాలైన కర్ణాటక, ఏపీ, తెలంగాణా, మహారాష్ట్ర ప్రజలు జరుపుకుంటారు. కొన్ని పండుగలు సర్వమత సమ్మేళనానికి నిదర్శనంగా నిలుస్తుంటాయి. అందులో ఉగాది పండుగ ఒకటి. ఉగాది పండుగ వచ్చిందంటే..చాలు..ఏపీ రాష్ట్రంలోని కడప జిల్లా గుర్తుకు వస్తుంది. ఈ పండుగను ముస్లింలు కూడా జరుపుకుంటుంటారు. వెంకన్న ఆలయానికి వెళ్లి ఆశీస్సులు తీసుకుంటుంటారు.

కడప నగరంలో దేవుని కడపగా పిల్చుకునే వెంకటేశ్వరస్వామి ఆలయం ఒకటి ఉంది. తిరుమలకు కాలినడకన వెళ్లే యాత్రికులు ముందుగా ఈ ఆలయాన్ని దర్శించుకొనే వారని, అందుకే ఈ ప్రాంతానికి దేవుని గడపగా పిల్చుకొనే వారని అంటుంటారు. అది రాను..రాను..కడపగా మారిందంటారు. ఇక్కడ వెంకన్న ఆలయం ఉంది. ఉగాది రోజున ముస్లిం భక్తులు భారీగా ఇక్కడకు తరలివచ్చి ప్రత్యేక పూజలు చేస్తుంటారు.

వెంకన్న భార్యలలో బీబీ నాంచారమ్మ ఒకరు. హిందూ – ముస్లింలకు బంధుత్వం ఏర్పడింది. బీబీనాంచారమ్మ ముస్లింల ఆడపడుచు కావడంతో…చుట్టుపక్కల ఉండే ముస్లింలు వెంకటేశ్వర స్వామిని అల్లుడిగా భావిస్తుంటారు. ప్రతి సంవత్సరం ఉగాది పర్వదినాన…తప్పకుండా ముస్లిం మహిళలు ఆయన్ను దర్శించుకుంటారు. అల్లుడిగా భావిస్తూ…పండుగకి ఇంటికి రావాలంటూ..మొక్కుకుంటారు. ఉగాది పచ్చడిలో వేసే చింతపండు, బెల్లం, వేపపువ్వు ఇతర పదార్థాలను వేసి ఆలయానికి చేరుకుని స్వామి వారికి నివేదిస్తారు.

అనంతరం కొబ్బరికాయలను కొట్టి పూజారులు ఇచ్చే హరతిని తీసుకుని..శఠారిని స్వీకరించి..తీర్థప్రసాదాలను తీసుకుంటారు. ఇంకో విశేషం ఏమిటంటే..ఈ రోజున వీరు మద్యం తీసుకోవడం, మాంసాహారాన్ని భుజించడం చేయరంట. చిత్తూరు, అనంతపురం జిల్లాల నుంచి ముస్లింలు భారీగా తరలివస్తారు.