Vijay Sai Reddy : రాజకీయాలకు గుడ్‌బై.. కొత్త వృత్తిలోకి విజయసాయిరెడ్డి.. అధికారిక ప్రకటన!

Vijay Sai Reddy : ఇకపై రాజకీయాల్లో తాను కొనసాగబోనని వ్యవసాయం చేసుకుంటూ తన జీవితాన్ని కొనసాగిస్తానని స్పష్టం చేశారు. ఇదే విషయాన్ని తన ఎక్స్ వేదికగా ప్రకటనలో తెలియజేశారు.

My future is agriculture

Vijay Sai Reddy : రాజకీయాలకు గుడ్‌బై చెప్పేశారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. ఇకపై వ్యవసాయమే తన భవిష్యత్తు కార్యాచరణగా ప్రకటించారు. ఇన్నాళ్ల తన రాజకీయా అనుభవాన్ని పక్కనపెట్టేసి కేవలం వ్యవసాయంపైనే తన దృష్టిని పెట్టబోతున్నట్టుగా ఆయన ప్రకటించారు. మొదటి నుంచి వైఎస్ జగన్‌కు అత్యంత సన్నితుడిగా మెలిగిన విజయసాయి తాను రాజకీయాల నుంచి తప్పుకోవాల్సిన సమయం ఆసన్నమైందనే సంకేతాలిచ్చారు.

ఇకపై రాజకీయాల్లో తాను కొనసాగబోనని వ్యవసాయం చేసుకుంటూ తన జీవితాన్ని కొనసాగిస్తానని, ఇదే తన అంతిమ కర్తవ్యంగా విజయసాయి స్పష్టం చేశారు. ఇదే విషయాన్ని తన ఎక్స్ వేదికగా ప్రకటనలో తెలియజేశారు. రాబోయే రోజుల్లో తాను ఏ రాజకీయ పార్టీలో కొనసాగబోయేది లేదని, ఎలాంటి పదవులు, ప్రయోజనాల గురించి ఆలోచనే లేదన్నారు. డబ్బు ఆశించి రాజీనామా చేయడం లేదని, తన నిర్ణయం పూర్తిగా తన వ్యక్తిగతమని చెప్పారు.

విజయసాయి రెడ్డి ఊహించని ప్రకటనతో ఏపీ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. విజయసాయి ఈ సంచలన నిర్ణయం వెనుక అసలు కారణాలేంటీ అనేది కూడా సర్వత్రా చర్చకు దారితీసింది. 2028 వరకు రాజ్యసభ పదవి కాలం ఉండగా, ఇలాంటి నిర్ణయం వెనుక అసలు కారణాలేంటీ అన్నది ఆసక్తికర చర్చ జరుగుతోంది. విజయసాయి రాజీనామాతో రాజ్యసభలో వైసీపీకి క్రమంగా బలం తగ్గే పరిస్థితి కనిపిస్తోంది.

ఛార్టర్డ్ అకౌంటెంట్‌గా మొదలై రాజ్యసభ ఎంపీ వరకు :
ఛార్టర్డ్ అకౌంటెంట్‌గా కెరీర్ మొదలుపెట్టిన విజయసాయిరెడ్డి.. వైసీపీలో ఎంపీగా కొనసాగుతూ వైఎస్ ఫ్యామిలీకి ఆడిటర్‌గా కూడా పనిచేశారు. అలా మొదలైన తన ప్రస్థానం వైసీపీలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. వైసీపీ ఆవిర్భావం సమయంలో కూడా విజయసాయి వైఎస్ జగన్ వెన్నుంటే నడిచారు.

ఈ నేపథ్యంలోనే జగన్ విజయసాయికి రెండు సార్లు రాజ్యసభకు వెళ్లేందుకు అవకాశం కల్పించారు. గత ఎన్నికల్లో కూడా నెల్లూరు ఉంచి ఎంపీగా విజయసాయి బరిలోకి దిగారు. కానీ, అనూహ్యంగా ఆ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. 2024 ఎన్నికల సమయానికి వైసీపీలో 11మంది రాజ్యసభ సభ్యులు ఉండగా, ఇటీవలే వైసీపీ పార్టీ సభ్యత్వానికి, రాజ్యసభకు 3 రాజీనామా చేశారు. ఇప్పుడు విజయసాయిరెడ్డి కూడా రాజీనామా చేయనునన్నట్టు ప్రకటించారు.

Read Also : YCP MP Vijayasai Reddy : విజయసాయిరెడ్డి సంచలన ప్రకటన.. రాజకీయాలకు గుడ్ బై..!