MLA Vasantha Krishna Prasad : ప్రభుత్వంపై వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ సంచలన వ్యాఖ్యలు
స్థానిక వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మైలవరం మండలం చంద్రాల సొసైటీ శంకుస్థాపన సభలో మరోసారి ప్రభుత్వంపై అసంతృప్తి వెల్లగక్కారు. తాను పుట్టినప్పటి నుంచి తన తండ్రి రాజకీయాల్లో ఉన్నారని గుర్తు చేశారు.
- bheemraj
- Published On : January 10, 2023 / 02:40 PM IST
VASANTHA
MLA Vasantha Krishna Prasad : ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా మైలవరం రాజీయాలు మళ్లీ గరం గరంగా మారాయి. స్థానిక వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మైలవరం మండలం చంద్రాల సొసైటీ శంకుస్థాపన సభలో మరోసారి ప్రభుత్వంపై అసంతృప్తి వెల్లగక్కారు. తాను పుట్టినప్పటి నుంచి తన తండ్రి రాజకీయాల్లో ఉన్నారని గుర్తు చేశారు. 55 ఏళ్లుగా తమ కుటుంబం రాజకీయాల్లో ఉందన్నారు.
అయితే 10 మంది రౌడీలను వెంటేసేకుని తిరగడం చేతగాక తాను పాత తరం నాయకుడిలా మిగిలిపోయాయనని ఆవేదన వ్యక్తం చేశారు. అప్పటి రాజకీయాలతో పోలిస్తే ఇప్పటి రాజకీయాలు మారిపోయాయని తెలిపారు. రౌడీలను వెంటేసుకుని వారిలా తిరిగితేనే ముందుకు వెళ్లే పరిస్థితులు ఉన్నాయని చెప్పారు. ఒక్కోసారి రాజకీయాల్లోకి వచ్చి ఎమ్మెల్యే ఎందుకయ్యానా అని బాధపడుతున్నానని పేర్కొన్నారు.
Mylavaram : మైలవరానికి వసంత.. పెడనకు జోగి…స్పష్టం చేసిన పెద్దిరెడ్డి
మూడున్నరేళ్లలో ఎవరిపై అక్రమ కేసులు బనాయించలేదన్నారు. అక్రమ కేసుల విషయంలో కొందరు నేతలకు తనపై అసంతృప్తి ఉందన్నారు. ఎవరికీ సంక్షేమ పథకాలు ఆపలేదని స్పష్టం చేశారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు రాజకీయంగా ప్రకంపనలు రేపుతున్నాయి. అయితే వసంత కృష్ణప్రసాద్ ఏం మాట్లాడినా అది వివాదాస్పదమవుతోంది.
గతం నుంచి కూడా ఆయన అసంతృప్తి వ్యక్తం చేస్తూ ప్రభుత్వంపై కామెంట్స్ చేస్తున్నారు. తాజాగా ఆయన చేసిన కామెంట్స్ ను చూస్తే ఆయనలో తీవ్రస్థాయిలో అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఇప్పటికే ఆయన చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో అసలు పార్టీలో ఏం జరుగుతుందనే చర్చ సాగుతోంది.
