Nadendla Manohar: జనసేన నినాదం ఇదే.. ఇక పవన్ బలమైన సందేశం ఇస్తారు: నాదెండ్ల మనోహర్
వైసీపీ ప్రభుత్వంపై పోరాడేందుకు పవన్ ప్రజలను సమాయత్తం చేస్తారని అన్నారు.
- T Venkateshwarlu
- Published On : September 30, 2023 / 08:53 PM IST
Nadendla Manohar
Nadendla Manohar: ‘వై ఏపీ డస్ నాట్ నీడ్ వైఎస్ జగన్?’ అనేది జనసేన నినాదం అని, మరోసారి ఆంధ్రప్రదేశ్‌కు జగన్ ఎందుకు వద్దో ప్రజలకు వివరిస్తామని జనసేన నేత నాదెండ్ల మనోహర్ అన్నారు. ఏపీలోని తెనాలిలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలోని అన్ని వర్గాలను వైసీపీ మోసం చేసిందని తెలిపారు.
రాష్ట్ర ప్రజలను జనసేన పార్టీ చైతన్యపరుస్తుందని నాదెండ్ల మనోహర్ చెప్పారు. ప్రజాధనంతో వైసీపీ సొంత కార్యక్రమాలు నిర్వహించుకోవడం సిగ్గుచేటని అన్నారు. వారాహి విజయ యాత్ర ద్వారా ప్రజలకు పవన్ కల్యాణ్ బలమైన సందేశం ఇవ్వనున్నారని తెలిపారు. అక్టోబర్ 1 నుంచి పవన్ చేపడుతున్న వారాహి విజయ యాత్రలో పార్టీ శ్రేణులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అన్నారు.
అవనిగడ్డ బహిరంగసభలో పాల్గొని జనసేన కార్యకర్తలను పవన్ పూర్తిస్థాయిలో చైతన్యవంతం చేస్తారని, వైసీపీ ప్రభుత్వంపై పోరాడేందుకు ప్రజలను సమాయత్తం చేస్తారని అన్నారు. ఎన్నికల వేళ వైసీపీ మరోసారి రాష్ట్ర ప్రజలను మోసం చేయడానికి, మభ్యపెట్టడానికి సిద్ధమైందని చెప్పారు. పవన్ ప్రజలను చైతన్యపరుస్తారని తెలిపారు.
వైసీపీ తీరుపై పోరాడేందుకు జనసేన-టీడీపీ శ్రేణులను సమన్వయం చేసుకుని ముందుకు వెళ్తామని తెలిపారు. వైసీపీ సర్కారుని ఇంటికి పంపాలనే బలమైన లక్ష్యంతో సమష్టి పోరాటాలు చేస్తామని వివరించారు.
Vijayasai Reddy: లోకేశ్ ఢిల్లీలో దాక్కున్నారు.. ఇలా మోత మోగిస్తే…: విజయసాయిరెడ్డి
