Nagababu : అలా అనుకుంటే అది వారి కర్మ- పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలుపుపై నాగబాబు కీలక వ్యాఖ్యలు

పవన్, పిఠాపురం ప్రజలు తప్ప ఆ గెలుపులో థర్డ్ ఫ్యాక్టర్ ఏమీ లేదన్నారు.

Nagababu : పిఠాపురంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ గెలుపుపై నాగబాబు హాట్ కామెంట్స్ చేశారు. పిఠాపురంలో పవన్ ను ఎవరైనా గెలిపించారనుకుంటే వారి కర్మ అని నాగబాబు కామెంట్ చేశారు. పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలుపు ముందే ఫిక్స్ అయిపోందన్న నాగబాబు.. పవన్, పిఠాపురం ప్రజలు తప్ప ఆ గెలుపులో థర్డ్ ఫ్యాక్టర్ ఏమీ లేదన్నారు.

”పిఠాపురంలో పవన్ కల్యాణ్ అఖండ విజయం సాధించడానికి రెండు ముఖ్యమైన ఫ్యాక్టర్స్ కారణం. ఒకటి జనసేన అధినేత పవన్ కల్యాణ్.. రెండో ఫ్యాక్టర్ పిఠాపురం జనసైనికులు, పిఠాపురం పౌరులు, పిఠాపురం ఓటర్లు.. వీళ్లిద్దరూ లేకపోతే మేము ఎంత ఏం చేసినా ఉపయోగం లేదు. మాలో ఇంక ఎవరైనా సరే పవన్ కల్యాణ్ విజయానికి నేనే దోహదపడ్డాను అని ఎవరైనా అనుకుంటే అది వారి కర్మ. అంతకంటే ఏమీ చేయలేము” అని నాగబాబు అన్నారు.

జనసేన అవిర్భావ సభలో.. పవన్ విజయానికి తామే దోహదపడ్డామని ఎవరైనా అనుకుంటే అది వారి కర్మ అంటూ నాగబాబు చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. కూటమి పార్టీల్లో చర్చకు దారితీశాయి. నాగబాబు చేసిన ఈ కామెంట్స్ పిఠాపురం మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత వర్మను ఉద్దేశించే అన్నవనే డిస్కషన్ జరుగుతోంది.

Also Read : ఇల్లేమో దూరం.. అసలే చీకటి.. చేతిలో దీపం కూడా లేదు.. కానీ.. అంటూ మరోసారి ఆ డైలాగ్ చెప్పిన పవన్ కల్యాణ్

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలుపుపై నాగబాబు చేసిన వ్యాఖ్యలను వైసీపీ అస్త్రంగా మార్చుకుంది. పవన్ కల్యాణ్ టార్గెట్ గా వైసీపీ విమర్శలు చేసింది. వర్మ సపోర్ట్ వల్లే తాను పిఠాపురంలో గెలిచానని చెప్పిన పవన్.. ఇప్పుడు ఆయనకే వెన్నుపోటు పొడిచే ప్రయత్నాలు చేస్తున్నారని వైసీపీ విమర్శించింది. తీరం దాటాక తెడ్డు తగలేసినట్లు జనసేనాని వ్యవహారం ఉందని ఆ పార్టీ నేతలు అంటున్నారు. అప్పట్లో వర్తు వర్మ అని.. ఇప్పుడు వారి కర్మ అంటున్నారని కామెంట్ చేస్తున్నారు.