Rk Roja (2)
RK Roja : నగరి ఎమ్మెల్యే రోజా మంగళవారం నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్బంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. నియోజకవర్గంలోని పుత్తూరులో ఏర్పాటు చేసిన సభకు రోజా హాజరయ్యారు. ఈ సందర్బంగా ప్రభుత్వం కళాకారులకు ఇచ్చిన డప్పులను, డ్రెస్ లను పంపిణి చేశారు.
అనంతరం డప్పు కళాకారులతో కలిసి డప్పు వాయించి అందరిని ఆశ్చర్యపరిచారు. కళాకారులతో కలిసి తానే డప్పు కొట్టి కళాకారులని ఉత్సాహపర్చారు ఎమ్మెల్యే రోజా. నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. ఇదే క్రమంలో పుత్తూరు మున్సిపాలిటీ పరిధిలో పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొన్నారు.
పాదిరేడు- ఎల్.ఎం కండిగ వయా తట్నేరి నుంచి తట్నేరి దళిత వాడ రోడ్డు నిర్మాణాన్ని ఆసియా అభివృద్ధి బ్యాంకు ద్వారా చేయించినందుకు కృతజ్ఞతతో ఎమ్మెల్యే రోజాకు స్థానిక నాయకులు, ప్రజలు పూలాభిషేకం చేసి ఘనంగా సత్కరించారు. కాగా పుత్తూరు పరిధిలో 72 మంది డప్పు కళాకారులకు ప్రభుత్వం డప్పు, డ్రెస్సు, గజ్జెలు, డప్పు కర్రలు, పై పంచె తదితర పరికరాలను అందించింది.