Site icon 10TV Telugu

Nagarjuna Sagar Dam: డేంజర్ జోన్‌లో నాగార్జున సాగర్.. అసలు పొంచి ఉన్న ప్రమాదం ఏంటి?

Nagarjuna Sagar

Nagarjuna Sagar

Nagarjuna Sagar Dam: తెలుగు రాష్ట్రాల్లో లక్షలాది ఎకరాలకు సాగు నీరు అందిస్తున్న నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ ప్రతిష్ట రానున్న రోజుల్లో మసక బారనుందా? 1967లో ప్రాజెక్ట్ నీటి నిల్వ సామర్థ్యం 408 టీఎంసీలు. ప్రాజెక్ట్ లో పూడిక పేరుకుపోవడంతో నీటి నిల్వ సామర్ధ్యం రోజురోజుకి తగ్గిపోతోంది. ప్రస్తుతం ప్రాజెక్ట్ నిల్వ సామర్థ్యం 300 టీఎంసీలకు తగ్గిపోయింది.

అసలు ప్రాజెక్ట్ కింద స్థిరీకరించిన వాస్తవ ఆయుకట్టను కృష్ణమ్మ ఎందుకు చేరుకోవడం లేదు? భవిష్యత్తు తరాలకు నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ చరిత్ర తెలిసే అవకాశం లేకుండా పోతుందా? అసలు నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ కు పొంచి ఉన్న ప్రమాదం ఏంటి?

తెలుగు రాష్ట్రాలు ఏపీ, తెలంగాణ రైతాంగానికి వరప్రదాని నాగార్జున సాగర్ ప్రాజెక్ట్. లక్షల ఎకరాలకు సాగునీరు అందించడంతో పాటు వేలాది గ్రామాలకు తాగు నీరు అందిస్తోంది. ప్రాజెక్ట్ నిర్వహణలో అనేక లోపాలు ఉన్నాయి. ప్రాజెక్ట్ నిర్వాహణ మొదలు స్పిల్ వే వరకు చాలా సమస్యలు ఉన్నాయి. అవన్నీ ప్రాజెక్ట్ కు ప్రమాదకరంగా మారాయి. అసలు డ్యామ్ కున్న ప్రమాదం ఏంటి? డ్యామ్ నిర్వహణలో ఉన్న లోపాలు ఏంటి?

నాగార్జున సాగర్ కు ప్రధాన ముప్పు పూడిక. నిర్మాణ సమయంలో ఈ రిజర్వాయర్ నీటి నిల్వ సామర్థ్యం 408 టీఎంసీలుగా నిర్ణయించారు. 1955లో డ్యామ్ నిర్మాణానికి శంకుస్థాపన అయితే 1967లో నిర్మాణం పూర్తైంది. అప్పటి నుంచి దాదాపు 70ఏళ్ల వరకు ఎప్పుడూ కూడా తట్టెడు మట్టి కూడా బయటకు తీసింది లేదు. ఎగువ నుంచి వచ్చే వరద నీరు ప్రాజెక్ట్ లోకి చేరుతుంది. ఈ క్రమంలో మట్టి, ఇసుక, రాళ్లు వచ్చి చేరుతుంటాయి.

* తెలుగు రాష్ట్రాల్లో లక్షలాది ఎకరాలకు సాగునీరు
* ప్రధాన కాల్వల నిర్వహణ సరిగా లేక తరచూ గండ్లు
* కృష్ణా నదిపై నిర్మించిన అతిపెద్ద ప్రాజెక్ట్ నాగార్జున సాగర్
* దేశంలోనే అతిపెద్ద రిజర్వాయర్
* 1967లో ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తి
* అప్పట్లో నీటి నిల్వ సామర్థ్యం 408 టీఎంసీలు
* ప్రస్తుతం నీటి నిల్వ సామర్థ్యంలో 6వ స్థానానికి దిగజారిన డ్యామ్
* ప్రస్తుతం నాగార్జున సాగర్ లో నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలు
* పూడిక తీయకపోవడంతో తగ్గుతున్న నీటి నిల్వ సామర్థ్యం
* లక్షలాది క్యూసెక్కుల నీటిని వదలడంతో దెబ్బతింటున్న స్పిల్ వే
* డ్యామ్ ప్రధాన ఆనకట్టకు ప్రమాదం ఏర్పడే అవకాశం

 

Exit mobile version