Stampede Incident Police Case : గుంటూరు జిల్లా తొక్కిసలాట ఘటనలో కేసు నమోదు

గుంటూరు జిల్లాలో తొక్కిసలాట ఘటనలో కేసు నమోదు చేశారు. నల్లంపాడు పోలీసులు సెక్షన్ 174, సెక్షన్ 304 కింద రెండు కేసులు నమోదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు.

Stampede Incident Police Case : గుంటూరు జిల్లాలో తొక్కిసలాట ఘటనలో కేసు నమోదు చేశారు. నల్లంపాడు పోలీసులు సెక్షన్ 174, సెక్షన్ 304 కింద రెండు కేసులు నమోదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. చంద్రన్న కానుకల పంపిణీ కార్యక్రమం నిర్వహకులపై కేసు నమోదు చేశారు. తొక్కిసలాటలో ముగ్గురు మృతి చెందారు. మరో 11 మందికి గాయాలయ్యాయి.

నిన్న సాయంత్రం చంద్రబాబు ప్రసంగం ముగించుకుని అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఆ వెంటనే చంద్రన్న కానుల పంపిణీ మొదలైంది. కౌంటర్ల వద్ద విపరీతమైన రద్దీ ఏర్పడింది. సభలో ఉన్న వారు కూడా కౌంటర్ల వద్దకు వెళ్లడంతో రద్దీ మరింత పెరిగింది. సాయంత్రం 6 గంటల ప్రాంతంలో రెండు కౌంటర్ల వద్ద తోపులాట జరిగింది. కొందరు క్యూలైన్లలో కాకుండా పంపిణీ చేస్తున్నవైపు దూసుకెళ్లడం, తొందరగా వెళ్లాలన్న తాపత్రయంతో గందగరోళం నెలకొంది.

Guntur Stampede : ఇలా జరుగుతుందని ఊహించలేదు.. గుంటూరు తొక్కిసలాటపై చంద్రబాబు దిగ్భ్రాంతి

అందరూ ఒక్కసారిగా ఒత్తిడి గురై బారీకేడ్లపై పండటంతో అవి ఒరిగిపోయాయి. బయటికి వెళ్లాలన్న ఆత్రుతతో బారీ కేడ్ల కింద పడ్డవారిపై నుంచి వెళ్లడం ఘటనకు కారణమైంది. సుమారు 20 నిమిషాలపాటు అక్కడ తీవ్ర గందరగోళం నెలకొంది.

ట్రెండింగ్ వార్తలు