Nara Bhuvaneswari : నిజం గెలవాలి పేరుతో భువనేశ్వరి యాత్ర : నారా లోకేశ్

అక్టోబర్ 25 నుంచి 'నిజం గెలవాలి' పేరుతో నారా భువనేశ్వరి యాత్ర చేయనున్నారు. చంద్రబాబు కోసం ఆవేదనతో మరణించిన వారి కుటుంబాలను భువనేశ్వరి పరామర్శిస్తారని లోకేశ్ తెలిపారు.

Nara Bhuvaneswari Nijam Gelavali program

Nara Bhuvaneswari: స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబు అరెస్ట్ అయ్యాక ఆయన భార్య నారా భువనేశ్వరి బయటకొచ్చారు. టీడీపీ చేపట్టిన పలు నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నారు.చంద్రబాబుకు మద్దతుగా చేపట్టిన కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.అలాగే చంద్రబాబు కోసం తపించి ఆవేదనతో మరణించినవారి కుటుంబాలను పరామర్శించేందుకు సిద్ధమవుతున్నారు.

దీంట్లో భాగంగా అక్టోబర్ 25 నుంచి ‘నిజం గెలవాలి’ పేరుతో టీడీపీ చేపట్టిన కార్యక్రమంలో నారా భువనేశ్వరి పాల్గొననున్నారు. ‘నిజం గెలవాలి’ పేరుతో చేపట్టిన యాత్రలో చంద్రబాబు కోసం ఆవేదనతో మరణించిన వారి కుటుంబాలను భువనేశ్వరి పరామర్శిస్తారని టీడీపీ విస్తృత స్థాయి సమావేశంలో లోకేశ్ తెలిపారు.

Nara Lokesh : భయమనేది టీడీపీ బయోడేటాలోనే లేదు,ఇందిరాగాంధీకే భయపడలేదు .. మరుగుజ్జు జగన్‌కు భయపడతామా..? : లోకేశ్

ఈ యాత్రలో భాగంగా భువనేశ్వరి 24న తిరుమలకు వెళ్లి శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకుని చంద్రబాబు స్వగ్రామం నారావారి పల్లెకి వెళతారని తెలిపారు. 25 నుంచి చంద్రబాబు అరెస్ట్ తో ఆవేదన చెంది మరణించినవారి కుటుంబాలను పరామర్శిస్తారని తెలిపారు.