పోలీసులు నారా లోకేష్ ను అరెస్ట్ చేశారు. రహదారుల దిగ్బంధనం నేపథ్యంలో లోకేష్ ను ముందస్తుగా అరెస్ట్ చేశారు పోలీసులు. బెంజ్ సర్కిల్ లో పోలీసులు లోకేష్ ను అదుపులోకి
పోలీసులు నారా లోకేష్ ను అరెస్ట్ చేశారు. రహదారుల దిగ్బంధనం నేపథ్యంలో లోకేష్ ను ముందస్తుగా అరెస్ట్ చేశారు పోలీసులు. బెంజ్ సర్కిల్ లో పోలీసులు లోకేష్ ను అదుపులోకి తీసుకున్నారు. యనమలకుదురు పోలీస్ స్టేషన్ కు తరలించారు. లోకేష్ తో పాటు టీడీపీ ఎమ్మెల్యే రామానాయుడు, మాజీ మంత్రి కొల్లు రవీంద్రని పోలీసులు అరెస్ట్ చేశారు. లోకేష్ అరెస్ట్ ను టీడీపీ నేతలు, కార్యకర్తలు అడ్డుకునే ప్రయత్నం చేశారు. పోలీసులు వారిని పక్కకు లాగేశారు. చినకాకాని దగ్గర జాతీయ రహదారి దిగ్బంధనంలో పాల్గొనేందుకు లోకేష్ వెళ్తుండగా పోలీసులు అరెస్ట్ చేశారు.
మూడు రాజధానులు అంశంపై ఆగ్రహావేశాలు చల్లార లేదు. రైతులు, ప్రతిపక్షాలు ఆందోళనలు సాగిస్తున్నాయి. రాజధాని తరలింపునకు వ్యతిరేకంగా అమరావతి రైతులు చేస్తున్న ఆందోళన 21వ రోజుకు చేరుకుంది. నిరసనలో భాగంగా ఇవాళ( జనవరి 7, 2019) జాతీయ రహదారులను దిగ్బంధించాలని రైతులు పిలుపునిచ్చారు.
అయితే అందుకు అనుమతి లేదంటూ నిరసన కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకోవడంతో రాజధాని గ్రామాల్లో ఉద్రిక్త వాతావరణం కనిపిస్తుంది. ముందస్తుగా ఎక్కడికక్కడ రైతులను, టీడీపీ నేతలను పోలీసులు అడ్డుకుంటున్నారు. కీలక నేతల ఇళ్లకు వెళ్లి వారిని గృహ నిర్బంధం చేస్తున్నారు. హైవేల దిగ్బంధానికి వెళ్లేందుకు ప్రయత్నించిన టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్, ఎంపీ కేశినేని నానిలను పోలీసులు అడ్డుకున్నారు. అలాగే మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు, దేవినేని ఉమామహేశ్వరరావులను కూడా నిర్బంధించారు.
చినకాకాని గ్రామంలో నిరసన కార్యక్రమంలో పాల్గొనే వారికోసం 2వేల మందికి గాను భోజనం తయారు చేస్తుండగా పోలీసులు అడ్డుకొని రైతులను అదుపులోకి తీసుకున్నారు. గుంటూరు జిల్లా మంగళగిరి, తాడేపల్లి ప్రాంతంలో టీడీపీ నాయకుల హౌస్ అరెస్ట్‌ల పర్వం కొనసాగుతోంది. గ్రామాల్లో ముఖ్య నేతలను స్టేషన్‌లకు తరలిస్తున్నారు. రాజధానిగా అమరావతిని మాత్రమే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ గుంటూరు జేఏసీ ఆధ్వర్యంలో చినకాకాని జాతీయ రహదారిపై నిరసనకు పిలుపునిచ్చిన నేపథ్యంలో ముందస్తు చర్యల్లో భాగంగా గుంటూరు జిల్లా మంగళగిరి జెఏసీ నాయకులను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. తెల్లవారుజాము నుంచే మంగళగిరి, తాడేపల్లి ప్రాంతాల్లో జేఏసీ నేతలు, ముఖ్యంగా టీడీపీ నేతలను గృహ నిర్బంధం చేశారు.
Also Read : అప్పుడు అదే ప్లస్.. ఇప్పుడు అదే మైనస్ : ఎమ్మెల్యే రోజాపై వ్యతిరేకత పెరుగుతోందా..?