Nara Lokesh: దీపావళి వేళ నిత్యావసరాల ధరల పెంపుపై నారా లోకేష్ విమర్శలు

ప్రజలందరికీ తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు.

Nara Lokesh

Nara Lokesh: ప్రజలందరికీ తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సంధర్భంగా నిత్యావసర ధరలపై లోకేష్ తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు.

దీపం వెలిగించుకుందాం అంటే నూనె ధర మండుతోందని అన్నారు. లైట్లు వేసుకుందామంటే కరెంటు చార్జీలు షాక్ కొడుతున్నాయని, ఏపీలో దీపావళి నాడు ప్రజల పరిస్థితి దారుణంగా ఉందన్నారు.

నరకాసుర పాలన అంటే ఇలాగే ఉండేదేమోనని అనిపిస్తుందని అన్నారు. మున్ముందు మంచి రోజులు రావాలని ఆశిద్దామని అన్నారు. ఇంటిల్లిపాదికీ ఆనందాలు పంచే దీపాల పండుగ వేళ, సర్వశుభాలు కలగాలని కోరుకున్నారు లోకేష్.