Nara Lokesh : ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో సిట్ విచారణకు నారా లోకేశ్

అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో నారా లోకేశ్ ఈరోజు సిట్ విచారణకు హాజరుకానున్నారు. దీని కోసం ఇప్పటికే ఆయన తాడేపల్లిల్లోని సిట్ కార్యాలయానికి చేరుకున్నారు. ఉదయం 10.00 గంటల నుంచి లోకేశ్ ను సిట్ అధికారులు విచారించనున్నారు.

Nara Lokesh Inner Ring Road Case

Nara Lokesh Inner Ring Road Case : అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో నారా లోకేశ్ ఈరోజు సిట్ విచారణకు హాజరుకానున్నారు. దీని కోసం ఇప్పటికే ఆయన తాడేపల్లిల్లోని సిట్ కార్యాలయానికి చేరుకున్నారు. ఉదయం 10.00 గంటల నుంచి లోకేశ్ ను సిట్ అధికారులు విచారించనున్నారు. ఉదయం 10గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు కొనసాగనున్న ఈ విచారణ అంతా న్యాయవాది సమక్షంలోనే జరుగనుంది. మధ్యాహ్నాం ఓ గంట లంచ్ బ్రేక్ ఇచ్చి ఆ తరువాత సిట్ అధికారులు తిరిగి విచారణ ప్రారంభించనున్నారు.

అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో లోకేష్‍ను A14గా పేర్కొంటూ ఏసీబీ కోర్టులో సీఐడీ మెమో ఫైల్ చేసిన విషయం తెలిసిందే. ఈక్రమంలో లోకేశ్ కు CRPC సెక్షన్ 41A కింద సీఐడీ నోటీసులు జారీ చేసింది. అక్టోబర్ 4న విచారణకు రావాల్సిందిగా సీఐడీ నోటీసులు ఇచ్చింది. ఈ నోటీసులో హెరిటేజ్ తీర్మానాలు, అకౌంట్స్ పుస్తకాలు తీసుకురావాలని లోకేష్‍ను సీఐడి ఆదేశించింది.

CID Notices : ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో మాజీ మంత్రి నారాయణ సతీమణి పేరు చేర్చిన సీఐడీ

సీఐడీ ఆదేశించిన నిబంధనలపై లోకేశ్ హైకోర్టులో సవాల్ చేశారు. దీంతో స్పందించిన ధర్మాసనం వాదనలు జరిగిన అనంతరం అకౌంట్స్ బుక్స్ కోసం లోకేశ్ ను ఒత్తిడి చేయవద్దని సీఐడీకి హైకోర్టు ఆదేశించింది. దీంతో హైకోర్టు ఇచ్చిన నిబంధనల ప్రకారం లోకేశ్ ను సిట్ అధికారులు న్యాయవాది సమక్షంలోనే విచారించనున్నారు. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు న్యాయవాది సమక్షంలో లోకేష్‌ను విచారించాలని హైకోర్టు సీఐడీకి సూచించింది.

కాగా లోకేశ్ సిట్ విచారణఖు హాజరువుతున్న క్రమంలో తాడేపల్లి సిట్ కార్యాలయం వద్దకు టీడీపీ శ్రేణులు భారీగా చేరుకునేందుకు సిద్ధమవుతున్నారనే సమాచారంతో పోలీసులు సిట్ కార్యాలయం వద్ద భారీగా మోహరించారు.