స్లిమ్‌గా మారిన ‘నారా’ లోకేశ్ కొత్త లుక్!

  • Publish Date - May 27, 2020 / 09:44 AM IST

టీడీపీ జాతీయ‌ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేశ్.. బరువు తగ్గారు.. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 20 కిలోలు తగ్గారు. లాక్ డౌన్ సమయాన్ని ఫిట్ నెస్ వర్కౌట్లకు సరిగ్గా వాడేశారు. డిజిటల్ మహానాడులో స్లిమ్ గా కనిపించి అందరిని ఆశ్చర్యపరిచారు. ఆకర్షణగా నిలిచారు. రాజకీయ రంగంలోకి ప్రవేశించిన లోకేశ్‌ను తప్పుపట్టేందుకు ప్రత్యర్థులు తప్పులు దొరక్కపోవడంతో ఆయన తడబడే మాటలన్ని పప్పు అంటూ ఎద్దేవా చేసేవారు.  అయినప్పటికీ సహనంతో నారా లోకేశ్.. ఎక్క‌డ నెగ్గాలో కాదు.. ఎక్క‌డ త‌గ్గాలో తెలిసిన‌వాడిలా 20 కిలోలు త‌గ్గి ఔరా అనిపించుకున్నారు. 

నిజాయితీగా ఒప్పేసుకున్న లోకేశ్‌.. తాను తెలుగు ఒక ప‌దం అటూ ఇటూ వేస్తానని, త‌ప్పుడు ప‌నులు మాత్రం చేయ‌నంటూ చెప్పుకొచ్చారు. ఎప్పటికీ త‌ప్పులు దొరకడం లేదు. ఈసారి లోకేశ్ బరువును టార్గెట్ చేస్తూ బాడీ షేమింగ్‌కి పాల్ప‌డ్డారు. అయినా పాజిటివ్‌గా తీసుకోవ‌డం లోకేశ్‌కే చెల్లింది. తండ్రి చంద్ర‌బాబు మాదిరిగానే బాడీషేమింగ్ ప్ర‌చారాన్ని చాలెంజ్‌గా తీసుకున్నారు. క‌రోనా లాక్‌డౌన్ టైములో హైద‌రాబాద్‌లో ఇరుక్కుపోవ‌డంతో క‌ఠోర వ్యాయామం, మితాహారం తీసుకుంటున్నారు. బాగ వర్కౌట్లు చేసిన లోకేశ్.. ఎక్క‌డ త‌గ్గాలో తెలుసుకుని 20 కేజీలు త‌గ్గి చూపించారు. 

మంత్రిగా మూడు శాఖ‌లు నిర్వ‌హించి వంద‌ల అవార్డులు సాధించిన ఘ‌న‌త‌, కెరీర్ మొత్తం మీద ఒక్క అవినీతి ఆరోప‌ణ కూడా చేయ‌లేనంత పార‌ద‌ర్శ‌క‌తతో లోకేశ్‌ పనిచేశారు. త‌ప్పులేని తెలుగు భాష త‌డ‌బాటు‌, బాడీ షేమింగ్‌తో ప్ర‌త్య‌ర్థులు దాడి చేస్తుండ‌టాన్ని పాజిటివ్‌గా తీసుకున్నారు. తెలుగులో చ‌క్క‌గా మాట్లాడ‌టం నారా లోకేశ్ నేర్చుకున్నారు. 2 నెల‌ల లాక్‌డౌన్ కాలంలో వ‌ర్క‌వుట్స్‌, డైట్‌తో భారీగా వెయిట్ త‌గ్గి చూపించారు.  వేలాదిమందిని ఆదుకుని పార్టీ నేత‌గా, సోష‌ల్ మీడియా కార్య‌క‌ర్త‌ల్ని అక్ర‌మంగా అరెస్టు చేస్తుంటే వారికి అండ‌గా నిలిచారు. యువ‌నేత‌గా, మంత్రిగా మూడు శాఖ‌ల‌పై చెర‌గ‌ని ముద్ర‌వేశారు లోకేశ్‌.. 

Read: నేను ఖర్చు పెట్టేది.. నా రాష్ట్రంలోని పిల్లలపైనే: జగన్