Nara Lokesh: సీఐడీ నోటీసులతో రెండో రోజు విచారణకు హాజరయ్యా.. ఈ ప్రశ్నలు అడిగారు: లోకేశ్

సీఐడీ అధికారులు తన ముందు భువనేశ్వరి ఐటీ రిటర్నులకు సంబంధించి ఓ డాక్యుమెంట్ పెట్టారని చెప్పారు. ఆమె ఐటీ రిటర్న్స్‌ ఎలా వచ్చాయని..

Nara Lokesh

Nara Lokesh: హైకోర్టు ఒక్కరోజే హాజరుకావాలని చెప్పినా తాను సీఐడీ నోటీసులతో రెండో రోజు కూడా విచారణకు హాజరయ్యానని టీడీపీ నేత నారా లోకేశ్ అన్నారు. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో లోకేశ్ ను సీఐడీ ఇవాళ విచారించింది. అనంతరం లోకేశ్ మీడియాతో మాట్లాడారు.

నిన్నటి ప్రశ్నలనే అధికారులు అటు, ఇటు తిప్పి మళ్లీ అడిగారని లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండు, మూడు మాత్రమే కొత్త ప్రశ్నలు అడిగారని తెలిపారు. ఇవాళ తన ముందు భువనేశ్వరి ఐటీ రిటర్నులకు సంబంధించి ఓ డాక్యుమెంట్ పెట్టారని చెప్పారు. ఆమె ఐటీ రిటర్న్స్‌ ఎలా వచ్చాయని ప్రశ్నించానని తెలిపారు. తాను అడిగిన ప్రశ్నలకు అధికారులు సమాధానం ఏమీ చెప్పలేదని అన్నారు.

నిందితులు కానివారి ఐటీ రిటర్నులు సీఐడీ చేతిలోకి ఎలా వెళ్లాయని నారా లోకేశ్ ప్రశ్నించారు. గతంలోని తన శాఖకు సంబంధించిన ప్రశ్నలను అధికారులు పదే పదే అడిగారని చెప్పారు. హెరిటేజ్ కొనుగోలు చేసిన తొమ్మిది ఎకరాల భూములను గూగుల్ ఎర్త్ లో చూపించారని తెలిపారు. ఐఆర్ఆర్ కారణంగా హెరిటేజ్ భూములు కోల్పోయినట్లు చూపించారని అన్నారు. ఐఆర్ఆర్ లో తనకు, తన కుటుంబ సభ్యులకు ఎటువంటి పాత్ర లేదని తెలిపారు.

Rajasthan Assembly election: అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ తేదీలో మార్పు.. ఎందుకంటే?