Nara Lokesh
Nara Lokesh Challenge : యువగళం పాదయాత్రలో టీడీపీ నేత నారా లోకేశ్ సీఎం జగన్, వైసీపీ ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు. విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. సీఎం జగన్ టార్గెట్ గా మాటల తూటాలు పేలుస్తున్నారు. తాజాగా సీఎం జగన్ సతీమణి భారతీ రెడ్డి టార్గెట్ గా లోకేశ్ ఫైర్ అయ్యారు. యువగళం పాదయాత్రలో భారతీ రెడ్డి పేరుని ప్రస్తావించారు లోకేశ్. దమ్ము ధైర్యం ఉంటే ఆ వీడియోని మీరు బయటపెట్టండి అంటూ భారతీ రెడ్డికి సవాల్ విసిరారు నారా లోకేశ్.
అసలేం జరిగిందంటే..
”ఈ రోజు నా మిత్రడు ఒకరు నాకు వాట్సాప్ పోస్ట్ పెట్టాడు. జగన్ భార్య భారతీ రెడ్డి నడిపించే పత్రికలోని ఆర్టికల్ అది. నేను దళితులను అవమానించాను అని అందులో రాశారు. నేను దళితులపై అసభ్యంగా మాట్లాడినట్లు రాశారు. పది సంవత్సరాల నుంచి మీరు ఎన్ని అబద్దాలు రాస్తున్నారు ఈ లోకేశ్ మీద. పదేళ్ల నుంచి నన్ను కించపరిచే విధంగా మీరు రాస్తున్నారు.
ఈ సభా ముఖంగా భారతీ రెడ్డికి నేనొక చాలెంజ్ విసురుతున్నా. మీకు దమ్ము ధైర్యం ఉంటే ఆ వీడియో మీరు బయటపెట్టండి. లేదంటే డేట్ మారే లోపల దళితులకు క్షమాపణ చెప్పండి అని ఈ సభా ముఖంగా భారతీ రెడ్డికి నేను సవాల్ విసురుతున్నా.
నీతి, నిజాయితీగా బతికే కుటుంబం మాది. ఏనాడూ ఎవరినీ అవమానించని కుటుంబం మాది. మా తాత విశ్వ విఖ్యాత నటసార్వ భౌమ నందమూరి తారకరామారావు నుంచి నా తండ్రి చంద్రబాబు వరకు ఈ లోకేశ్ ఒక్కరిని కూడా కించపరిచే విధంగా మాట్లాడలేదు. అందుకే ఈ రోజు ఆ పేపర్ డైరెక్టర్ గా ఉన్న భారతీ రెడ్డికి సవాల్ విసురుతున్నా.
Also Read..Kodali Nani: జగన్ కంటే చంద్రబాబు ఆస్తులే ఎక్కువ.. నిమ్మకూరుపై వారికే ప్రేముంది..
నిజంగానే బాధ కలుగుతుంది. దళితులను చంపేది మీరు. సంక్షేమ కార్యక్రమాలు కట్ చేసేది మీరు. మర్డర్ కేసులో అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్లిన ఎమ్మెల్సీ అనంత్ బాబుని ఇప్పటివరకు పదవి నుంచి తొలగించని మీరు నా గురించి మాట్లాడతారా? దమ్ము ధైర్యముంటే ఛాలెంజ్ ని స్వీకరించండి. లేదంటే క్షమాపణ చెప్పండి” అని సభా ముఖంగా సవాల్ విసిరారు నారా లోకేశ్.