Nara Lokesh – CM Jagan: ఏపీలో రాజకీయాలు హీటెక్కాయి. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టుతో వైసీపీ వర్సెస్ టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. చంద్రబాబును కావాలనే అక్రమంగా అరెస్టు చేశారని, ఎలాంటి విచారణ లేకుండా అరెస్ట్ ఎలా చేస్తారంటూ వైసీపీ ప్రభుత్వాన్ని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు ప్రభుత్వం నుంచిసైతం ఘాటు కౌంటర్లు వస్తున్నాయి. చంద్రబాబు స్కిల్ డెవలప్ మెంట్ స్కాంలో ప్రధాన సూత్రదారి అంటూ వైసీపీ నేతలు పేర్కొంటున్నారు. ఇదిలాఉంటే.. గత వారం రోజులుగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఢిల్లీలో ఉంటున్నారు. దీంతో అక్రమాలకు పాల్పడి.. అరెస్ట్ చేస్తారన్న భయంతో లోకేశ్ ఢిల్లీలో దాక్కున్నాడని పలువురు వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు. ఈ క్రమంలో ఢిల్లీలో ఉన్న నారా లోకేశ్ సీఎం జగన్ మోహన్ రెడ్డి టార్గెట్‌గా ఆసక్తికర ట్వీట్ చేశారు.
Read Also: Chandrababu quash petition in SC : సుప్రీంకోర్టులో క్వాష్ పిటీషన్ దాఖలు చేసిన చంద్రబాబు
లోకేశ్ ట్వీట్ ప్రకారం.. ‘ బెయిల్ డే పదో వార్షికోత్సవ శుభాకాంక్షలు జైలు మోహన్. 42వేల కోట్లు ప్రజాధనం దోచేసి, సీబీఐ-ఈడీ పెట్టిన 38 కేసుల్లో ఏ1 అయినా పదేళ్లుగా బెయిలుపై ఉన్న ఆర్థిక ఉగ్రవాది జైలు మోహన్. ప్రజాస్వామ్య వ్యవస్థల్ని ధ్వంసం చేస్తూ, రాజ్యాంగాన్ని కాలరాస్తూ, నీతిమంతుల్ని జైలుకు పంపుతున్నాడు . జైలులో ఉండాల్సిన జగన్ పదేళ్లుగా బెయిలుపై ఉంటే, జనంలో ఉండాల్సిన నిజాయితీపరుడు చంద్రబాబు జైలులో ఉన్నారు. అంటూ లోకేశ్ ట్వీట్‌లో పేర్కొన్నారు.
ఇదిలాఉంటే.. స్కిల్ డవలప్ మెంట్ స్కాంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటూ జైలులో ఉన్న చంద్రబాబు నాయుడు క్వాష్ పిటీషన్ ను శుక్రవారం హైకోర్టు కొట్టివేసిన విషయం తెలిసిందే. దీంతో చంద్రబాబు హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేస్తూ పిటీషన్ దాఖలు చేశారు. సోమవారం విచారణకు వచ్చే అవకాశం ఉంది. మరోవైపు ఏసీబీ కోర్టు చంద్రబాబును రెండురోజులు విచారణ నిమిత్తం సీఐడీ కస్టడీకి అప్పగించింది. రెండు రోజులు స్కిల్ డవలప్ మెంట్ స్కాంలో పలు విషయాలపై చంద్రబాబు నుంచి సీఐడీ అధికారులు సమాధానాలు రాబట్టనున్నారు.
బెయిల్ డే పదో వార్షికోత్సవ శుభాకాంక్షలు జైలు మోహన్. 42 వేల కోట్లు ప్రజాధనం దోచేసి, సీబీఐ-ఈడీ పెట్టిన 38 కేసుల్లో ఏ1 అయినా పదేళ్లుగా బెయిలుపై ఉన్న ఆర్థిక ఉగ్రవాది జైలు మోహన్ ప్రజాస్వామ్య వ్యవస్థల్ని ధ్వంసం చేస్తూ, రాజ్యాంగాన్ని కాలరాస్తూ, నీతిమంతుల్ని జైలుకు… pic.twitter.com/UPpdTzrvDF
— Lokesh Nara (@naralokesh) September 23, 2023