Nara Lokesh: మంగళగిరి కోర్టుకు నారా లోకేశ్.. అందరి సంగతి తేలుస్తా.. వైసీపీ నేతలకు వార్నింగ్

అధికారంలోకి రాగానే సిట్ వేసి అందరి సంగతి తేలుస్తాం. ఎమ్మెల్యేల అవినీతిపై నేను చేస్తున్న అవినీతి ఆరోపణలపై విచారణ చేయించుకునే దమ్ము వారికుందా?

Nara Lokesh in Mangalagiri Court

Nara Lokesh – Defamation Suit తనపై తప్పుడు ప్రచారం చేసే ఎవ్వరినీ వదిలిపెట్టనని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. పరువు నష్టం (defamation suit) కేసులో శుక్రవారం ఆయన మంగళగిరి కోర్టు (Mangalagiri Court)కు హాజరయ్యారు. అదనపు మేజిస్ట్రేట్‌ ముందు వాంగ్మూలం ఇచ్చారు. తనపై అసత్య ప్రచారం చేశారని ఆరోపిస్తూ గుర్రంపాటి దేవేందర్‌రెడ్డి (devendra reddy rurrampati), పోతుల సునీత (pothula sunitha)పై లోకేశ్ పరువునష్టం దావా వేశారు. నందమూరి ఉమామహేశ్వరి మరణం, హెరిటేజ్ సంస్థపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని.. వీరిపై చర్యలు తీసుకోవాలని ఆయన కోర్టును ఆశ్రయించారు.

ఈ సందర్భంగా నారా లోకేశ్ మాట్లాడుతూ.. నా రాజకీయ ఎదుగుదలను లక్ష్యంగా చేసుకుని 2012 నుంచి అసత్య ఆరోపణలు చేస్తూనే ఉన్నారని అన్నారు. అసత్య ఆరోపణలకు ఇక చెక్ పెట్టాలనే పరువునష్టం దావాలు వేస్తున్నట్టు వెల్లడించారు. తనపై చేసిన ఆరోపణలు వెనక్కి తీసుకోమని హెచ్చరించినా పోతుల సునీత వినలేదు కాబట్టే రూ.50 కోట్లకు పరువునష్టం దావా వేసినట్టు చెప్పారు.

”తోబుట్టువులు లేని నాకు, మా పిన్నమ్మ కూతుళ్లనే సొంత సోదరీమణులుగా చూసుకున్నా. అలాంటి నాపై గుర్రంపాటి దేవేందర్‌రెడ్డి తప్పులు పోస్టు పెట్టినందుకు రూ.50 కోట్లకు పరువు నష్టం దావా వేశా. ఏనాడూ తప్పు చేయలేదు కాబట్టే మాపై చేసిన ఆరోపణల్ని ఒక్కటీ నిరూపించలేకపోయారు. జగన్మోహన్ రెడ్డిపై మేం ఆధారాలతో ఆరోపణలు చేశాం కాబట్టే జైలుకెళ్లటంతో పాటు అక్రమ ఆస్తుల జప్తు జరిగింది. వివేకా హత్యపై నారాసుర రక్త చరిత్రంటూ అసత్యాలు రాశారు. సీబీఐ చార్జిషీటులో ఇప్పుడెవ్వరు ఉన్నారో అందరికీ తెలుసు. వివేకా హత్యలో జగన్మోహన్ రెడ్డి పాత్రపైనా సీబీఐ విచారణ జరగాలి.

Also Read: జగ్గూ భాయ్‌ని ఎలా కంట్రోల్ చేయాలో జనసేనకు బాగా తెలుసు- పవన్ కల్యాణ్

పాదయాత్రలో వైకాపా ఎమ్మెల్యేలపై నేను చేస్తున్న ఆరోపణలకు కట్టుబడి ఉన్నాను. అధికారంలోకి రాగానే సిట్ వేసి అందరి సంగతి తేలుస్తాం. ఎమ్మెల్యేల అవినీతిపై నేను చేస్తున్న అవినీతి ఆరోపణలపై విచారణ చేయించుకునే దమ్ము వారికుందా? తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో రూ.6 లక్షల కోట్ల అవినీతి జరిగిందని పుస్తకం కూడా ముద్రించిన వైకాపా.. 6 పైసల అవినీతి కూడా నిరూపించలేకపోయింది. సీఎం ఇన్వెస్టిగేషన్ డిపార్ట్ మెంట్ గా సీఐడీ మారిపోయింద”ని నారా లోకేశ్ అన్నారు.

Also Read: షాక్ మీద షాక్.. పరిపాలన రాజధాని నగరం వైసీపీకి అచ్చి రావడం లేదా?

ట్రెండింగ్ వార్తలు