Yuvagalam: నారా లోకేశ్‌ యువగళం పాదయాత్ర ముగింపు సభకు భారీ ఏర్పాట్లు

చిత్తూరు, తిరుపతి, అనంతపూరం, నెల్లూరు, మాచర్ల తదితర ప్రాంతాల నుంచి ఏడు ప్రత్యేక ట్రైన్లు బయలుదేరనున్నాయి. ఒక్కో రైలులో 1,300 మంది..

Nara Lokesh

Nara Lokesh: టీడీపీ నేత నారా లోకేశ్‌ యువగళం పాదయాత్ర తుది దశకు చేరుకుంది. ఈ నెల 20న విజయనగరం జిల్లాలో జరిగే యువగళం ముగింపు సభకు టీడీపీ భారీ ఏర్పాట్లు చేస్తోంది. అన్ని జిల్లాల నుంచి కార్యకర్తలు తరలివచ్చే విధంగా ఏర్పాట్లు కొనసాగుతున్నాయి.

ఈ నెల 19న వివిధ ప్రాంతాల నుంచి ప్రత్యేక ట్రైన్లు విజయనగరం బయలుదేరతాయి. చిత్తూరు, తిరుపతి, అనంతపూరం, నెల్లూరు, మాచర్ల తదితర ప్రాంతాల నుంచి ఏడు ప్రత్యేక ట్రైన్లు బయలుదేరనున్నాయి. ఒక్కో రైలులో 1,300 మంది ప్రయాణించే విధంగా ఏర్పాట్లు చేశారు.

ఆర్టీసీ నుంచి అద్దెకు ప్రత్యేక బస్సులు కావాలని సంబంధిత అధికారులను ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు కోరారు. కాగా, నారా లోకేశ్ 223వ రోజు యువగళం పాదయాత్రను ఉమ్మడి విశాఖ జిల్లా పంచదార్ల క్యాంప్‌ సైట్‌ నుంచి ప్రారంభించారు. పాదయాత్రలో భాగంగా లోకేశ్ ప్రజల సమస్యలు అడిగి తెలుసుకుంటున్నారు.

AP Cabinet : జగనన్న ఆరోగ్య సురక్ష రెండో విడతకు ఆమోదం.. ఏపీ క్యాబినెట్ కీలక నిర్ణయాలు