ఏం పీకుతారో పీక్కోండి..నారా లోకేష్ ట్వీట్

  • Publish Date - February 16, 2020 / 07:28 PM IST

టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా ట్వీట్స్ చేస్తూ రాజకీయ వేడి రగిలిస్తున్నారు. వైసీపీ ప్రభుత్ విధానాలను ట్వీట్ల ద్వారా ఎండగడుతున్నారు. వరుస ట్వీట్లతో..ఘాటు వ్యాఖ్యలతో విరుచుకపడుతున్నారు. తాజాగా ఆయన చేసిన ట్వీట్లు వైరల్‌గా మారుతున్నాయి. సోషల్ మీడియాలో ఓ వీడియోను పోస్టు చేసిన టీడీపీ కార్యకర్తను అక్రమంగా అరెస్టు చేయడంపై ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. 

* ‘జగన్ దగ్గర మార్కులు కోసం అధికారుల అత్యుత్సాహం తగదు. కోర్టులు చివాట్లు పెట్టే పరిస్థితి తెచ్చుకోవద్దు. విజయ్ కుమార్ రెడ్డికి నేను అండగా ఉంటా. విజయ్ పోస్ట్ నేను పోస్ట్ చేస్తున్నా. ఏం పీకుతారో పీక్కోండి జగన్. ఫైనల్ గా విజయ్ పులివెందుల పులి, జగన్ పులివెందుల పిల్లి. అంటూ ట్వీట్ చేశారు. 

* దానికంటే ముందు..కేంద్రం మెడలు వంచేస్తా” అన్న వస్తాదు సోషల్ మీడియా పోస్టులకు భయపడటం ఏంటి? పులివెందుల పులి అంటూ డప్పు కొట్టించుకున్నారు. ఇప్పుడు పులి, పిల్లి అయ్యిందా ? వైకాపా ప్రభుత్వం అమ్మ ఒడి పథకానికి బడుగు, బలహీన వర్గాలకు చెందాల్సిన 6,500 కోట్లు పక్కదారి పట్టించిందంటూ ఆరోపించారు. 

Read More : ఇలా చేయకండి : ప్రాణం తీసిన లైవ్ వీడియో

* ఆ వీడియోని పోస్ట్ చేసినందుకు, బీసీలకు అన్యాయం చేస్తున్నారు అని పోస్ట్ పెట్టినందుకు పులివెందులకు చెందిన టిడిపి కార్యకర్త విజయ్ కుమార్ రెడ్డిని అక్రమంగా అరెస్ట్ చేస్తారా? ముసుగు వేసి మీడియా ముందు ప్రవేశపెడతారా? అంత పెద్ద తప్పు ఏం చేశాడు ? అంటూ ప్రశ్నించారు నారా లోకేష్. ఈయన చేసిన ట్వీట్లపై వైసీపీ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.