NARA LOKESH: కుప్పం చంద్రబాబు అడ్డా.. వైసీపీ అరాచకాలు చేస్తుంది -నారా లోకేష్

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పర్యటన చిత్తూరు జిల్లా కుప్పంలో రెండో రోజు కొనసాగుతోంది.

NARA LOKESH: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పర్యటన చిత్తూరు జిల్లా కుప్పంలో రెండో రోజు కొనసాగుతోంది. కుప్పం మున్సిపల్ ఎన్నికల వేళ కుప్పంలో రాజకీయాలు హీటెక్కాయి. ఈ క్రమంలోనే ఒకటవ వార్డులో బండశెట్టిపల్లి ఎన్నికల ప్రచారంలో లోకేష్ మాట్లాడారు. రెండున్నరేళ్లుగా కుప్పంను పట్టించుకోని వైసీపీ నాయకులు ఇప్పుడొచ్చి కుక్కల్లా మొరుగుతున్నారని విమర్శించారు.

వైసీపీ రౌడీలు, గుండాలు, ఎర్ర చందనం స్మగ్లర్లు ప్రశాంతమైన కుప్పంలోకి వచ్చి అరాచకాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మద్యం బాటిల్ దగ్గర్నుంచి నిత్యం తినే పప్పు, ఉప్పు వరకు అన్ని రకాల ధరలను వైసీపీ అమాంతం పెంచేసిందని ఆరోపించారు లోకేష్. రౌడీలు గూండాలకు భయపడకుండా ఓటు వేసి టీడీపీని గెలిపించాలని లోకేష్ ప్రజలను అభ్యర్థించారు.

Chennai Rains : వానలో పెళ్లి.. బోటులో వధూవరులను తీసుకెళ్లిన రెస్క్యూ టీం

కుప్పం చంద్రబాబు అడ్డాయని, చంద్రబాబు చేసిన సంక్షేమమే కుప్పంలో ఇంకా అమలవుతుందన్నారు నారా లోకేష్. హంద్రీ-నీవా ప్రాజెక్టు 90శాతం చంద్రబాబు హయంలో పూర్తి చేసామని, మిగిలిన పది శాతం పనులను రెండున్నరేళ్లుగా వైసీపీ నేతలు చేయలేదన్నారు నారాలోకేష్. అన్నీ పెంచుకుంటూ పోతామని చెప్పిన జగన్ చివరకు కరెంటు చార్జీలు, కూరగాయల ధరలు పెంచుతున్నారని మండిపడ్డారు.

ఏపీలో రాజారెడ్డి రాజ్యాంగం..!

సీఎం జగన్ ఏ రోజైనా కుప్పం గురించి మాట్లాడారా? ఇక్కడి అభివృద్ధిని పట్టించుకున్నారా? అని ప్రశ్నించారు లోకేష్. కేవలం ఎన్నికల కోసమే కుప్పం గురించి మాట్లాడుతున్నారని, పక్క నియోజకవర్గంలోని రౌడీలు, గూండాలు కుప్పంలో దిగిపోయారని అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో అన్ని వార్డుల్లో టీడీపీని గెలిపించాలని కోరారు నారా లోకేష్.

ట్రెండింగ్ వార్తలు