Nara Rohit: ఏపీ సీఎం జగన్‌పై టాలీవుడ్ హీరో తీవ్ర విమర్శలు

అందుకే భౌతికంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారని నారా రోహిత్ అన్నారు. చంద్రబాబుపై కక్షపూరితంగా...

Nara Rohit YS Jagan

Chandrababu Arrest: స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు జైలులో ఉన్న నేపథ్యంలో దీనిపై టాలీవుడ్ హీరో నారా రోహిత్ స్పందించారు. అమరావతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ… చంద్రబాబు నాయుడి ఆరోగ్యంతో జగన్ చెలగాటాలు ఆడటం దుర్మార్గపు చర్య అని చెప్పారు.

చంద్రబాబు ఆత్మ విశ్వాసాన్ని దెబ్బతీయలేకపోతున్నారని, అందుకే భౌతికంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారని నారా రోహిత్ అన్నారు. చంద్రబాబుపై కక్షపూరితంగా అక్రమ కేసులు నమోదు చేశారని చెప్పారు. జైలులో 37 రోజులుగా నిర్బంధించి ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్నారు.

చంద్రబాబు నాయుడు చర్మ సంబంధిత సమస్యలతో బాధపడుతుంటే ఆయనను ఎగతాళి చేయడం సిగ్గుచేటని విమర్శించారు. జగన్ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని, ప్రజల ముందు ఆయన తిరస్కరణకు గురికాక తప్పదని అన్నారు. కాగా, జైలులో చంద్రబాబు ఆరోగ్యం క్షీణిస్తోందని టీడీపీ నేతలు అంటున్నారు.

Komatireddy Venkat Reddy: కాంగ్రెస్ అభ్యర్థుల తదుపరి జాబితా కూడా ఇలాగే ఉంటుంది: కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి