Nara Rohith : క్లిష్ట సమయంలో అండగా నిలబడి ధైర్యం ఇచ్చారు.. నారా రోహిత్

తన తండ్రి నారా రామ్మూర్తి నాయుడు మృతితో తమ కుటుంబం విచారంగా ఉన్నవేళ అండగా నిలిచిన వారికి రోహిత్ ధన్యవాదాలు చెప్పారు.

Nara Rohith

Nara Rohit : చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే, సీఎం చంద్రబాబు సోదరుడు నారా రామ్మూర్తి నాయుడు అంతిమ సంస్కారం కుటుంబ సభ్యులు, బంధువులు, ఆత్మీయుల మధ్య ఆదివారం సాగాయి. తమ అభిమాన నేతను కడసారి చూసి.. ఘనంగా వీడ్కోలు పలికేందుకు ప్రజలు, నాయకులు పెద్దెత్తున తరలివచ్చి రామ్మూర్తి అంత్యక్రియల్లో పాల్గొన్నారు. ఆదివారం సాయంత్రం ప్రభుత్వ అధికార లాంఛనాలతో రామ్మూర్తి నాయుడి అంత్యక్రియలు పూర్తయ్యాయి. ఈ అంత్యక్రియల్లో సీఎం చంద్రబాబు, నారా భువనేశ్వరి, మంత్రి నారా లోకేశ్, నారా బ్రహ్మిణితో పాటు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

Also Read: Nara Rohit: ‘నాన్నా.. మీరొక ఫైటర్’.. తండ్రి మృతితో సినీనటుడు నారా రోహిత్ భావోద్వేగ పోస్టు

తాజాగా నారా రోహిత్ ట్విటర్ వేదికగా అందరికీ ధన్యవాదాలు తెలిపారు. తన తండ్రి నారా రామ్మూర్తి నాయుడు మృతితో తమ కుటుంబం విచారంగా ఉన్నవేళ అండగా నిలిచిన వారికి రోహిత్ ధన్యవాదాలు చెప్పారు. నా తండ్రిని కోల్పోయిన సమయంలో మీరు చూపిన ప్రేమ, మద్దతు మమ్మల్ని తీవ్రంగా కదిలించాయి. మీ హృదయపూర్వక సానుభూతి, ఓదార్పునిచ్చే మాటలు మా కుటుంబానికి అపారమైన శక్తినిచ్చాయని రోహిత్ పేర్కొన్నారు. తన పెదనాన్న సీఎం చంద్రబాబు నాయుడు, పెద్దమ్మ భువనేశ్వరి, అన్న లోకేశ్, వదిన బ్రాహ్మిణిలకు నారా రోహిత్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కష్ట సమయంలో మా వెంటఉండి అండగా నిలిచారని, కుటుంబానికి ధైర్యాన్ని ఇచ్చారని రోహిత్ పేర్కొన్నారు.