ఎన్డీయే కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థులు వీరే..!

కూటమిలో టీడీపీతోపాటు జనసేన, బీజేపీ నుంచి చాలా మంది ఎమ్మెల్సీ పదవులను ఆశించారు. తొలి చాన్స్‌ తమకే ఇవ్వాలని కూటమిలో పెద్ద పార్టీగా టీడీపీ నేతలు కోరారు.

NDA Mlc Candidates : ఉత్కంఠ వీడింది. ఊహాగానాలకు తెరపడింది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది ఎన్డీయే కూటమి. టీడీపీ నుంచి సి.రామచంద్రయ్య, జనసేన నుంచి పిడుగు హరిప్రసాద్ పేర్లు ఖరారయ్యాయి. హరిప్రసాద్ ప్రస్తుతం జనసేనాని పవన్ కల్యాణ్ రాజకీయ కార్యదర్శిగా ఉన్నారు. కూటమి తరపున ఎమ్మెల్సీ అభ్యర్థులుగా సి.రామచంద్రయ్య, జనసేన నేత పిడుగు హరిప్రసాద్ నామినేషన్ దాఖలు చేయనున్నారు.

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీల ఎన్నికకు షెడ్యూల్‌ విడుదలైంది. జూలై 2 నుంచి నామినేషన్లు స్వీకరించనున్నారు. 12న ఎమ్మెల్సీల ఎన్నిక జరగనుంది. ఎన్నికలకు ముందు వైసీపీ నుంచి టీడీపీలో చేరిన సి.రామచంద్రయ్య, ఇక్బాల్‌ రాజీనామాలతో ఈ ఖాళీలు ఏర్పడ్డాయి. రెండేళ్ల కాలపరిమితి ఉన్న ఈ పదవులు టీడీపీకి దక్కే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ప్రస్తుతం సభలో టీడీపీ కూటమికి 164 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. దీంతో ఎమ్మెల్యేల కోటాలో సులువుగా ఎమ్మెల్సీలను గెలిచే అవకాశం ఉంది. అయితే, ఈ రెండు ఎమ్మెల్సీ పదవులకు ఎవరిని ఎంపిక చేస్తారు అనేది కూటమి పార్టీల మధ్య విస్తృత చర్చకు దారితీసింది.

కూటమిలో టీడీపీతోపాటు జనసేన, బీజేపీ నుంచి చాలా మంది ఎమ్మెల్సీ పదవులను ఆశించారు. తొలి చాన్స్‌ తమకే ఇవ్వాలని కూటమిలో పెద్ద పార్టీగా టీడీపీ నేతలు కోరారు. ఎన్నికల సమయంలో సీట్లు త్యాగాలు చేసిన పలువురు నేతలు ఎమ్మెల్సీలుగా చట్టసభలో అడుగుపెట్టాలని ఆరాటపడ్డారు. ఇక పదవులు వదులుకుని పార్టీలో చేరిన సి.రామచంద్రయ్య, ఇక్బాల్‌ సైతం మళ్లీ అవే పోస్టులను ఆశించారు. చివరికి, మరోసారి సి. రామచంద్రయ్యే అవకాశం ఇచ్చారు చంద్రబాబు.

Also Read : ఆపరేషన్ ద్వారంపూడి..! మాజీ ఎమ్మెల్యే చుట్టూ ఉచ్చు బిగిస్తున్న పవన్ కల్యాణ్..!

ట్రెండింగ్ వార్తలు