AP Rains : ఏపీలో విస్తారంగా వర్షాలు-ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సిధ్ధం

నైరుతి రుతుపవనాల ప్రభావం, బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణివల్ల ఏపీలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి.

AP Rains : నైరుతి రుతుపవనాల ప్రభావం, బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణివల్ల ఏపీలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి.  గోదావరి నదికి వరద ఉధృతి పెరుగుతోంది. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద ప్రస్తుతం ఇన్ ఫ్లో , ఔట్ ఫ్లో 5,91,269 క్యూసెక్కులుగా ఉంది.  ఎప్పటి కప్పుడు వరద ఉధృతిని సమీక్షిస్తూ వరద ముంపు ప్రభావిత జిల్లాల అధికారులను విపత్తుల సంస్థ అప్రమత్తం చేస్తోంది.

రాష్ట్రంలో వరద విపత్తును ఎదుర్కోటానికి  ముందస్తుగా   అత్యవసర సహాయక చర్యల కోసం రెండు ఎన్డీఆర్ఎఫ్, మూడూ ఎస్డీఆర్ఎఫ్ బృందాలను సిధ్ధం చేశారు.  గోదావరి పరీవాహాక ప్రాంతాలలో ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

మరోవైపు విజయవాడ ప్రకాశం బ్యారేజికి కూడా వరద నీరు వచ్చి చేరటంతో అధికారులు గేట్లు ఎత్తి కిందకు నీటిని విడుదల చేస్తున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని..బోట్లు, మోటర్ బోట్లు, స్టీమర్లలతో నదిలో ప్రయాణించవద్దని   ఏపీ విపత్తునిర్వహణ సంస్ధ అధికారులుసూచించారు. వరద నీటిలో ఈతకు వెళ్ళడం,చేపలు పట్టడం, స్నానాలకు వెళ్ళడం లాంటివి చేయవద్దని వారు కోరారు.

Also Read : Trains Canceled : భారీ వర్షాల ఎఫెక్ట్.. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 10 రైళ్లు రద్దు

 

ట్రెండింగ్ వార్తలు