ఏపీలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 48 కొత్త కేసులు నమోదయ్యాయి. 8,148 మంది
ఏపీలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 48 కొత్త కేసులు నమోదయ్యాయి. 8,148 మంది నమూనాలు పరీక్షించగా.. 48 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయినట్టు వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్‌లో తెలిపింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 2,719 కి చేరింది. కరోనాతో గడచిన 24 గంటల్లో తూర్పు గోదావరి జిల్లాలో ఒకరు మృతి చెందారు. దీంతో ఇప్పటి వరకు మృతి చెందిన వారి సంఖ్య 57కు చేరింది. కొత్తగా నమోదైన 48 కేసుల్లోనూ కోయంబేడు కాంటాక్టు కేసులు ఉన్నాయి. చిత్తూరు జిల్లాలో నాలుగు కేసులు అవే.
గత 24 గంటల్లో కరోనా నుంచి కోలుకుని 55మంది డిశ్చార్జి అయ్యారు. దీంతో ఇప్పటివరకు కోలుకున్న వారి సంఖ్య 1,903కి చేరింది. 759 మంది బాధితులు వేర్వేరు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. జిల్లాల వారీగా కేసులు వివరాలు మాత్రం ఇవ్వలేదు.