New Vista dome Coach: విశాఖ – అరకు టూరిజానికి మరో 4అద్దాల రైళ్లు రెడీ

టూరిజాన్ని మరింత అభివృద్ధి చేసే క్రమంలో విశాఖ-అరకు మధ్య మరో అద్దాల రైలును తీసుకొస్తుంది రైల్వే బోర్డు. విస్టాడోమ్‌(అద్దాల) కోచ్‌ ఒకటి మాత్రమే ఈ మార్గంలో పర్యాటకులకు అందుబాటులో ఉంది

New Vistadome Coach:  టూరిజాన్ని మరింత అభివృద్ధి చేసే క్రమంలో విశాఖ-అరకు మధ్య మరో అద్దాల రైలును తీసుకొస్తుంది రైల్వే బోర్డు. విస్టాడోమ్‌(అద్దాల) కోచ్‌ ఒకటి మాత్రమే ఈ మార్గంలో పర్యాటకులకు అందుబాటులో ఉంది. దాంతో పాటు మరో 4చేర్చి ఐదుకు పెంచేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. అదనంగా కావాల్సిన వాటిలో ఇప్పటికే మూడు విశాఖకు చేరుకున్నాయి. మరో రెండు వారాల్లో ఇంకోటి కూడా రానున్నట్లు వాల్తేరు రైల్వే డివిజన్‌ అధికారులు వెల్లడించారు.

అత్యాధునిక ఎల్‌హెచ్‌బీ రైలునూ ఈ మార్గంలో నడిపేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. కేవలం అద్దాల కోచ్‌లతోనే ప్రత్యేక రైలును అరకు వరకు నడిపితే ఎలా ఉంటుందనేదీ ఒక ఆలోచన. ఇలా చేస్తే దేశంలోనే తొలిసారిగా పూర్తిగా విస్టాడోమ్‌ కోచ్‌లతో నడిచే రైలు విశాఖదే అవుతుంది. దీనికి ప్రత్యేక రైలు నంబరు ఇచ్చే అవకాశముంది. మంగళవారం నుంచి ట్రయల్‌ రన్‌ నిర్వహిస్తారు.

అతి పెద్ద అద్దాలతో కూడిన కోచ్ లో రొటేటబుల్ ఛైర్లు ఏర్పాటు చేసి అరకు ప్రయాణం మరింత ట్రెండీగా మార్చేశారు. ఇండియాలోనే అద్దాల ట్రైన్ తొలిసారి అరకు వాలీ స్టేషన్ లోనే లాంచ్ అవుతుంది.

గతంలో విస్టాడోమ్ కోచ్ లను విశాఖపట్నంలో ఏప్రిల్ 2017న లాంచ్ చేశారు. అప్పటి నుంచి విశాఖపట్నం నుంచి అరకు వెళ్లడానికి హై డిమాండ్ కొనసాగుతూనే ఉంది. దీని టిక్కెట్ ధర. 670 ఉండగా అప్పోజిట్ డైరక్షన్ లో ఎగ్జిక్యూటివ్ క్లాస్ కేటగిరీలో కూర్చొంటే రూ.520 అవుతుందట.

ట్రెండింగ్ వార్తలు