NIA-Kidari Murder Case : కిడారి, సోమ హత్య కేసులో ఎన్ఐఏ అనుబంధ చార్జ్‌షీట్

అరకు మాజీ ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివిరి సోమ హత్య కేసులో ఎన్ఐఏ అనుబంధ చార్జ్ షీట్ దాఖలు చేసింది. విజయవాడ కోర్టులో ఎన్ఐఏ చార్జ్ షీట్ దాఖలు చేసింది.

NIA Chargesheet-Kidari Murder Case : అరకు మాజీ ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివిరి సోమ హత్య కేసులో ఎన్ఐఏ అనుబంధ చార్జ్ షీట్ దాఖలు చేసింది. విజయవాడ కోర్టులో ఎన్ఐఏ చార్జ్ షీట్ దాఖలు చేసింది. మావోయిస్టు ఏరియా కమిటి సభ్యురాలు కళావతి అలియాస్ భవానీపై కూడా సప్లమెంటరీ చార్జ్ షీట్ దాఖలైంది. కిడారి సర్వేశ్వరరావును 40 మంది హత్య చేసినట్టు తెలిపింది. కిడారి హత్యలో సాకే కళావతి కీలక పాత్ర పోషించినట్టు ఎన్ఐఏ పేర్కొంది.

హత్య చేసేందుకు అవసరమైన లాజిస్టిక్స్‌ను మావోయిస్టులకు కళావతి సరఫరా చేసినట్లు ఎన్ఐఏ తెలిపింది. మావోయిస్టు స్టేట్ కమిటీ మెంబర్ కాకూరి పెద్దన్న భార్య కళావతి అని ఎన్ఐఏ చెబుతోంది. హత్య చేసిన సమయంలో ఇన్‌సాస్ రైఫిల్‌తో పాటుగా పలు మారణాయుధాలను కళావతి ధరించిందని ఆరోపించింది.

కిడారి, సివిరి హత్యలకు పదిహేను రోజుల ముందు డుంబ్రిగూడలో రెక్కీ నిర్వహించేందుకు బస చేసారని పేర్కొంది. 2018లో అర‌కు ఎమ్మెల్యే కిడారి స‌ర్వేశ్వ‌ర్‌ను మావోయిస్టులు హ‌త్య చేశారు. ఈ కేసులో 9 మందిపై అభియోగాలు న‌మోదు కాగా.. మొత్తం 40 మంది పేర్ల‌ను ఛార్జిషీట్‌లో ఎన్ఐఏ చేర్చింది.

ట్రెండింగ్ వార్తలు