Night Curfew
Night Curfew in AP:మరోసారి కొవిడ్ కేసులు పెరుగుతున్న కారణంగా.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే నైట్ కర్ఫ్యూ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఆ నిర్ణయంలో కొన్ని కీలక మార్పులు చేస్తూ.. ప్రభుత్వం మరో ఉత్తర్వులను జారీ చేసింది. సంక్రాంతి తర్వాత కర్ఫ్యూను అమలు చేయనున్నట్టు ఉత్తర్వుల్లో తెలిపింది.
జగన్ ప్రభుత్వ ఆదేశాల ప్రకారం.. సోమవారం రాత్రే ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. కానీ.. మరో రెండు రోజుల్లో సంక్రాంతి పండగ రానుంది. ఇప్పటికే.. తెలుగు రాష్ట్రాల నుంచి ప్రజలు తమ సొంతూళ్లకు రాకపోకలు ప్రారంభించారు. ముఖ్యంగా.. తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ కు వేలాదిగా ప్రజలు తరలివెళ్తున్నారు. బస్సులు, రైళ్లు, ప్రైవేట్ వాహనాలు.. భారీ సంఖ్యలో ఏపీ వైపు వెళ్తున్నాయి.
రిజర్వేషన్లు దొరకని వాళ్లైతే.. సొంత వాహనాలు, స్నేహితుల వాహనాల్లో తమ ఊళ్లకు వెళ్తున్నారు. ఈ క్రమంలో.. నైట్ కర్ఫ్యూ ఆంక్షలతో ప్రజలు కచ్చితంగా ఇబ్బంది పడే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ పరిణామాన్ని పరిగణలోకి తీసుకున్న జగన్ ప్రభుత్వం.. ఉత్తర్వులు సవరించింది. పండగ తర్వాత నైట్ కర్ఫ్యూ అమల్లోకి రానున్నట్టు తెలిపింది.
మరోవైపు.. బస్సుల్లో ప్రజలంతా మాస్కులు ధరించే ప్రయాణాలు చేయాలని స్పష్టం చేసిన ప్రభుత్వం.. ఈ విషయంలో ఆర్టీసీ ఉన్నతాధికారులకు తగిన సూచనలు చేసింది. ప్రజలు కూడా.. కొవిడ్ మార్గదర్శకాలు పాటిస్తూ.. ప్రయాణాలు చేయాలని కోరింది. ఫైనల్ గా.. సంక్రాంతి తర్వాత నైట్ కర్ఫ్యూ అమల్లోకి రానుందన్న వార్తలతో.. ప్రజలు రిలాక్స్ అయ్యారు. ప్రశాంతంగా తమ ఊళ్లకు ప్రయాణాలు చేస్తున్నారు.
Read More:
Nattikumar on Curfew: ఆంధ్రప్రదేశ్‌లో నైట్ కర్ఫ్యూతో టాలీవుడ్‌కు నష్టమే.. కానీ..!