Nattikumar on Curfew: ఆంధ్రప్రదేశ్‌లో నైట్ కర్ఫ్యూతో టాలీవుడ్‌కు నష్టమే.. కానీ..!

కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వ్యాప్తి కారణంగా.. ఏపీలో నైట్ కర్ఫ్యూ విధించడంపై.. సినీ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ నట్టికుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు.

Nattikumar on Curfew: ఆంధ్రప్రదేశ్‌లో నైట్ కర్ఫ్యూతో టాలీవుడ్‌కు నష్టమే.. కానీ..!

Nattikumar

Nattikumar on Curfew: కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వ్యాప్తి కారణంగా.. ఏపీలో నైట్ కర్ఫ్యూ విధించడంపై.. సినీ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ నట్టికుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. కర్ఫ్యూ కారణంగా సినిమా పరిశ్రమకు నష్టమే అన్నారు. మరోవైపు.. ప్రజల శ్రేయస్సు కారణంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది కాబట్టి.. సమర్థించాల్సిందే అని తేల్చారు. సినిమాలకు సంక్రాంతి సీజన్ చాలా కీలకమైందని.. పెద్ద పండగకు సినిమాలు బాగా ఆడాలని పరిశ్రమలో అంతా కోరుకుంటారని చెప్పారు.

ఇలాంటి పరిస్థితుల్లో.. ఇప్పటికే పెద్ద సినిమాలు వెనక్కు వెళ్లాయని.. చిన్న సినిమాలపై.. ఇప్పుడు నైట్ కర్ఫ్యూ, 50 శాతం ఆక్యుపెన్సీ ఆంక్షలు తీవ్ర ప్రభావాన్ని చూపిస్తాయని నట్టి కుమార్ చెప్పారు. కానీ.. ప్రజల ప్రాణాల కంటే ఏదీ ముఖ్యమైనది కాదని.. అందుకే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తప్పుబట్టడానికి ఏమీ లేదని కూడా అన్నారు.

సినిమాల టికెట్ ధరల పెంపుపైనా.. ఇప్పటికే నట్టి కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న వారిపై ఎదురుదాడి చేశారు. ప్రభుత్వం వేసిన కమిటీ రిపోర్టు వచ్చే వరకూ.. ఎవరూ ఏమీ చేయలేరని అన్నారు. మంత్రి పేర్ని నానితో దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సమావేశంపైనా ఆయన చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి.

ఈ క్రమంలో.. నట్టికుమార్.. ఏపీలో నైట్ కర్ఫ్యూపైనా స్పందించారు. ఈ ఆంక్షలతో పరిశ్రమకు నష్టం తప్పదంటూనే.. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించక తప్పని పరిస్థితి ఏర్పడిందన్నారు.

Read More:

Natti Kumar : సినిమా థియేటర్లు, ఫిలిం ఛాంబర్ వివాదంపై నట్టి కుమార్ సెన్సేషనల్ కామెంట్స్