Covid 19 Duty
Covid-19 Duty: కరోనా విధులు నిర్వహించాలంటే చాలామంది భయపడుతుంటారు. తమకు ఎక్కడ సోకుతుందో అని కరోనా రోగుల దగ్గరకు రావడానికి కూడా దైర్యం చెయ్యరు. కానీ ఓ తొమ్మిది నెలల గర్భవతి మాత్రం ఎటువంటి భయం లేకుండా కరోనా విధులు నిర్వహిస్తుంది. గ్రామంలో తిరుగుతూ కరోనా సోకిన వారికి దైర్యం చెబుతుంది. తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరం మండలం కె.ముంజవరం ఆరోగ్య ఉపకేంద్రం పరిధిలో అంకాని వెంకటలక్ష్మి ఏఎన్‌ఎంగా పనిచేస్తున్నారు. ప్రస్తుతం ఆమె తొమ్మిది నెలల గర్భవతి. అయినా కూడా భయపడకుండా కరోనా విధులు నిర్వహిస్తుంది. కరోనాతో బాధపడుతున్న వారికి దైర్యం చెబుతూ ఆరోగ్య పరిస్థితి సరిగా లేని వారిని ఆసుపత్రులకు పంపుతున్నారు. ఇక ఐసోలేషన్ లో ఉన్నవారికి మందులు అందిస్తూ.. ఆరోగ్య కేంద్రానికి సంబందించిన రికార్డులను పై అధికారులకు చేరవేయడం వంటి పనులు చేస్తున్నారు. ఇక నిండు గర్భవతిగా ఉంది ఎందుకు విధులకు హాజరవుతున్నావని ఎవరైన ప్రశ్నిస్తే.. ఇలాంటి సమయంలో విధులు నిర్వహిస్తేనే నిజమైన సంతృప్తి అని వెంకటలక్ష్మి చెబుతున్నారు.