Karumuri Nageshwara Rao : ఎప్పుడు ఎన్నికలు వచ్చినా.. ఎన్ని పార్టీలు కలిసినా సింగిల్ గానే పోటీ : మంత్రి కారుమూరి

ముందస్తు ఎన్నికలకు వెళ్లడం అనేది విడ్డురంగా ఉందన్నారు. ముందస్తు ఎన్నికలు తమకు అవసరం లేదని పేర్కొన్నారు. రాష్ట్రానికి ప్యాకేజీ కాదు ప్రత్యేక హోదా కావాలి అంటున్నామని తెలిపారు.

Minister Karumuri Nageshwara Rao : ఏపీలో ఎన్ని పార్టీలు కలిసినా వైసీపీ సింగిల్ గా పోటీ చేస్తుందని ఏపీ పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు పేర్కొన్నారు. జగన్ మోహన్ సింగిల్ గా వస్తారని తెలిపారు. ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తామని, గతంలో కంటే ఎక్కువ స్థానాలే వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా సింగిల్ గా ఎదుర్కొంటామని పేర్కొన్నారు. ముందు ఎన్నికలు వచ్చినా, వెనుక వచ్చినా మేము రెడీ అని వెల్లడించారు.

అన్ని ఎన్నికల్లో సింగిల్ గానే పోటీ చేసి విజయం సాధించామని తెలిపారు. గత ఎన్నికల కంటే ఈ సారి ఎక్కువ సీట్లు రావడం ఖాయమన్నారు. ప్రతి ఇంటితో పెనవేసుకున్న వ్యక్తిగా జగన్ ఉన్నారని వెల్లడించారు. ముందస్తు ఎన్నికలకు వెళ్లడం అనేది విడ్డురంగా ఉందన్నారు. ముందస్తు ఎన్నికలు తమకు అవసరం లేదని పేర్కొన్నారు. రాష్ట్రానికి ప్యాకేజీ కాదు ప్రత్యేక హోదా కావాలి అంటున్నామని తెలిపారు. కేంద్రం ప్రత్యేక హోదా లేదన్నా తాము అడుగుతూనే ఉంటామని చెప్పారు. కేంద్రంతో ప్రత్యేక హోదా ఏ విధంగా సాధించుకోవాలో జగన్ మోహన్ రెడ్డికి తెలుసన్నారు.

Supreme Court Collegium : ఏపీ, తెలంగాణ సహా ఏడు రాష్ట్రాల హైకోర్టులకు కొత్త చీఫ్ జస్టిస్‌లు.. సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు

రాష్ట్ర ప్రయోజనాల కోసం జగన్ ఢిల్లీ వచ్చి కావాల్సినవన్నీ సాధించుకుంటున్నారని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రయోజనాలే తమకు ముఖ్యం అన్నారు. ఢిల్లీలో జరిగిన పౌర సరఫరాల శాఖ మంత్రుల సమావేశంలో మంత్రి కారుమూరి పాల్గొన్నారు. మిల్లెట్స్, పీడీఎస్ రైస్ పంపిణీపై పలు సూచనలు చేశారు. ఏపీలో రాగుల పంటను ప్రోత్సాహించేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. రాగులకు క్వింటాలుకు రూ.3846 ఎంఎస్పీ ఇస్తామని అన్ని కలెక్టరేట్లలో రైతులకు తెలియజేస్తున్నామని చెప్పారు.

రేషన్ లో గోధుమ పిండిని ప్రతి గ్రామనికి ఇచ్చేలా చర్యలు చేపడుతున్నామని తెలిపారు. గత ప్రభుత్వం సివిల్ సప్లై డిపార్ట్ మెంట్ ను దివాళా తీసేలా చేసిందని విమర్శించారు. జగన్ ప్రభుత్వం సివిల్ సప్లై డిపార్ట్ మెంట్ ను గాడిన పెట్టిందని తెలిపారు. ధాన్యం సేకరణతో రైతులు సంతోషంగా ఉన్నారని పేర్కొన్నారు. లబ్ధి దారులకు గత ప్రభుత్వం కంటే కందిపప్పు, చక్కెర రెట్టింపు ఇస్తున్నామని పేర్కొన్నారు. ప్రజలకు బియ్యం, గోధుమ పిండి, చక్కెర, రాగులు ఒక కిట్ లా ఇస్తున్నామని తెలిపారు. రేషన్ కార్డుల విషయంలో పాత లెక్కలనే కేంద్రం పరిగణలోకి తీసుకుంటుందన్నారు.

CM Jagan : ముగిసిన సీఎం జగన్ ఢిల్లీ టూర్.. ప్రధాని మోదీ, అమిత్ షాతో కీలక అంశాలపై చర్చ

నూతన జనాభా లెక్కల ఆధారంగా చర్యలు తీసుకుంటామని కేంద్ర మంత్రి చెప్పారని గుర్తుల చేశారు. కేంద్ర ప్రభుత్వం 80 లక్షల మందికి రేషన్ ఇస్తుంటే,, రాష్ట్ర ప్రభుత్వం అదనంగా 50 లక్షలకు పైగా కుటుంబాలకు ఉచితంగా రేషన్ ఇస్తుందని వెల్లడించారు. దీనికి అదనపు ఖర్చు రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందన్నారు. ఏపీలో రాష్ట్ర ప్రభుత్వం అదనంగా రేషన్ ఇస్తున్న వారిని పరిగణనలోకి తీసుకోవాలని నీతిఆయోగ్ రికమాండ్ చేసిందన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసమే సీఎం జగన్ ఢిల్లీ పర్యటనకు వెళ్లారు.

బీజేపీ.. వారి ప్రయోజనాల కోసం ఏపీ రాష్ట్ర అధ్యక్షురాలిగా పురందేశ్వరిని నియమించారని తెలిపారు. అది బీజేపీ పార్టీ వారి ఇష్టం అన్నారు. పురందేశ్వరి నియామకం వల్ల తమకు మంచే జరుగుతుందన్నారు. ఏపీ.. శ్రీలంకలా మారుతుందని.. పప్పు బెల్లంలా పంచుతారా అని చంద్రబాబు అన్నారు.. ఇప్పుడు అన్ని రంగాల్లో ఏపీ ముందంజలో ఉందన్నారు. నాటి చంద్రబాబు ప్రభుత్వం పౌర సరఫరాల శాఖను దివాలా తీయించిందని విమర్శించారు. రూ.20 వేల కోట్ల అప్పులు చేసింది, వాటిని పసుపు, కుంకుమకు మళ్లించారని ఆరోపించారు.

Sajjala Ramakrishna Reddy: సీఎం జగన్ తీసుకున్న ఈ నిర్ణయం అందరికీ గర్వకారణం: సజ్జల

ఆ అప్పులన్నీ తాము తీర్చి, శాఖను మళ్లీ గాడిలో పెట్టామని పేర్కొన్నారు. ధాన్యం సేకరణలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేశామని తెలిపారు. ధాన్యం తడిసినా, నూక వస్తున్నా రైతులకు మద్దతు ధర ఇచ్చామని గుర్తు చేశారు. కోటి 46 లక్షల మందికి తాము రేషన్ ఇస్తున్నామని పేర్కొన్నారు. కేంద్రం కంటే అదనంగా 60 లక్షల కార్డులు ఇచ్చాం, వాటికి కేంద్రం సాయం చేయాలని కోరామని తెలిపారు. నీతి ఆయోగ్ దీనికి అనుకూలంగా సిఫారసు చేసిందని చెప్పారు.

ట్రెండింగ్ వార్తలు