CM Jagan : ముగిసిన సీఎం జగన్ ఢిల్లీ టూర్.. ప్రధాని మోదీ, అమిత్ షాతో కీలక అంశాలపై చర్చ

CM Jagan : మోదీ, అమిత్ షాతో భేటీలో రాజకీయ అంశాలు కూడా చర్చకు వచ్చినట్లు సమాచారం.

CM Jagan : ముగిసిన సీఎం జగన్ ఢిల్లీ టూర్.. ప్రధాని మోదీ, అమిత్ షాతో కీలక అంశాలపై చర్చ

CM Jagan

CM Jagan Delhi Tour : ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటన ముగిసింది. ఢిల్లీ నుంచి విజయవాడకు బయలుదేరారు. ఢిల్లీ టూర్ లో కేంద్ర ప్రభుత్వ పెద్దలతో జగన్ సమావేశం అయ్యారు. ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తో జగన్ భేటీ అయ్యారు.

గంటకుపైగా ప్రధాని మోదీతో చర్చలు జరిపారు జగన్. అమిత్ షా తో 45 నిమిషాల పాటు భేటీ సాగింది. అరగంటకుపైగా నిర్మలా సీతారామన్ తో జగన్ సమావేశం అయ్యారు. ఏపీకి సంబంధించి ఆర్థిక సహకారం, పోలవరం ప్రాజెక్టుకు, పెండింగ్ నిధులు, విభజన అంశాలను ప్రస్తావించారు జగన్. మోదీ, అమిత్ షాతో భేటీలో రాజకీయ అంశాలు కూడా చర్చకు వచ్చినట్లు సమాచారం.

Also Read.. Vundavalli Arun Kumar: దీనిపై జగన్, చంద్రబాబు, పవన్ తమ వైఖరేంటో చెప్పాలి: ఉండవల్లి

ఢిల్లీ పర్యటనలో సీఎం జగన్ బిజీబిజీగా గడిపారు. కేంద్ర ప్రభుత్వ పెద్దలతో వరుసగా సమావేశం అయ్యారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, బకాయిలు, పోలవరం ప్రాజెక్ట్ నిధులు తదితర అంశాలపై డిస్కస్ చేశారు. అలాగే ఏపీకి ఆర్థిక సహకారం, పెండింగ్ అంశాలపైనా కేంద్రం పెద్దలతో చర్చించారు జగన్. గడిచిన ఆరు నెలల్లో ప్రధాని మోదీతో సీఎం జగన్ భేటీ కావడం ఇది మూడోసారి. రాష్ట్రానికి సంబంధించిన ఆర్థికపరమైన అంశాలతో పాటు రాజకీయ అంశాలు కూడా ఈ సమావేశంతో ముడిపడి ఉన్నాయని సమాచారం. ఎన్డీయేలోకి వైసీపీ వెళ్తుందా? ఆహ్వానిస్తున్నారా? అన్నది తెలియాల్సి ఉంది.

Also Read..MLA Anil Kumar : నువ్వు 10 వేల మందిని తెచ్చుకో.. నేను కేవలం 100 మందితోనే వస్తా : లోకేష్ కు ఎమ్మెల్యే అనిల్ సవాల్

కేంద్ర కేబినెట్ పునర్ వ్యవస్థీకరణ జరగనుంది. ఈ క్రమంలో వైసీపీని ఎన్డీయేలోకి ఆహ్వానిస్తున్నారా? అనే చర్చ జరుగుతోంది. ఒకపక్క కేంద్ర కేబినెట్ పునర్ వ్యవస్థీకరణ జరుగుతోంది. మరోపక్క రాష్ట్రాలకు సంబంధించిన అధ్యక్షులను బీజేపీ పెద్దలు మారుస్తున్నారు. ఇంకోపక్క గవర్నర్ల మార్పు కూడా ఉండనుంది అనే చర్చ నడుస్తోంది. ఇటువంటి కీలక సమయంలో మరొక బీజేపీయేతర పార్టీలకు సంబంధించిన ముఖ్యమంత్రిని ఢిల్లీకి పిలిపించడం, ఆయనకు అపాయింట్ మెంట్ ఇవ్వడం, ఆయన కలవడం.. ఈ పరిణామాల నేపథ్యంలో రాజకీయంగా జగన్, ప్రధాని మోదీ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.