MLA Anil Kumar : నువ్వు 10 వేల మందిని తెచ్చుకో.. నేను కేవలం 100 మందితోనే వస్తా : లోకేష్ కు ఎమ్మెల్యే అనిల్ సవాల్

రాజకీయాల్లోకి రాక ముందు తన తండ్రి ఇచ్చిన అస్తి కన్నా.. ఒక్క రూపాయి ఎక్కువ ఉందని నిరూపించే దమ్ము లోకేష్ కి ఉందా అని ప్రశ్నించారు. అభివృద్ధిపై చర్చకు సిద్ధమని లోకేష్ ప్రకటిస్తే.. అర గంటలో సింగిల్ గా వస్తానని ప్రకటించారు.

MLA Anil Kumar : నువ్వు 10 వేల మందిని తెచ్చుకో.. నేను కేవలం 100 మందితోనే వస్తా : లోకేష్ కు ఎమ్మెల్యే అనిల్ సవాల్

Anil Kumar Yadav challenge Nara Lokesh

Anil Kumar challenge Nara Lokesh : టీడీపీ నాయకుడు నారా లోకేష్ వ్యాఖ్యలపై నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కౌంటర్ ఇచ్చారు. నిజం చెబితే తల పది వేల చక్కలు అవుతుందని లోకేష్ కి శాపం ఉందన్నారు. జన సమీకరణ కోసం లోకేష్ ఒక రోజు పాదయాత్రకు బ్రేక్ ఇచ్చారని తెలిపారు. సభ పెట్టిన పక్కనే ఉన్న ఎన్ టీఆర్ విగ్రహానికి పూల మాల వెయ్యకపోవడం సిగ్గు చేటన్నారు. తాను రూ.వెయ్యి కోట్లు సంపాదించానని లోకేష్ తనపై చేసిన ఆరోపణలపై తిరుమల కొండపై ప్రమాణానికి సిద్ధమా అని సవాల్ చేశారు.

రాజకీయాల్లోకి రాక ముందు తన తండ్రి ఇచ్చిన అస్తి కన్నా.. ఒక్క రూపాయి ఎక్కువ ఉందని నిరూపించే దమ్ము లోకేష్ కి ఉందా అని ప్రశ్నించారు. అభివృద్ధిపై చర్చకు సిద్ధమని లోకేష్ ప్రకటిస్తే.. అర గంటలో వస్తానని, సింగిల్ గా వస్తానని ప్రకటించారు. “యుద్ధానికి రమ్మని పిలిచినా వస్తా.. నువ్వు 10 వేల మందిని తెచ్చుకో.. నేను కేవలం 100 మందితోనే వస్తా” అని పేర్కొన్నారు.

Bandi Sanjay: కిషన్ రెడ్డి, ఈటల రాజేందర్‌లను ఉద్దేశిస్తూ బండి సంజయ్ మరో ఆసక్తికర ట్వీట్..

లోకేష్ మగాడు అయితే.. 2024లో సిటీలో తనపై గెలుపును ఆపాలన్నారు. “లోకేష్ కి దమ్ముంటే నా ఛాలెంజ్ ని స్వీకరించు.. నెల్లూరు సిటీలో పోటీ చెయ్యి.. నేను ఓడిపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటా” అని వెల్లడించారు. కార్పొరేటర్లు లేఅవుట్లు వేస్తే.. దాన్ని కూడా తానే వేసినట్లు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. జగన్.. ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గొంతు కోశారని లోకేష్ అనడం విడ్డూరంగా ఉందన్నారు.

ఆ.. ఎమ్మెల్యే 30 ఏళ్ళు రాజకీయ పార్టీల చుట్టూ తిరిగినా.. టికెట్ ఇవ్వకపోతే, జగన్.. రెండు సార్లు శ్రీధర్ రెడ్డికి టికెట్ ఇచ్చారని పేర్కొన్నారు. అవినీతికి బ్రాండ్ అంబాసిడర్ అని అజీజ్ చెప్పిన ఎమ్మెల్యే ఇప్పుడు లోకేష్ పక్కన ఉన్నారని ఎద్దేవా చేశారు. కష్టకాలంలో పార్టీకి అండగా ఉన్న అజీజ్ గొంతును టీడీపీ కోసేసిందని ఆరోపించారు.

Eatala Rajender : అధికారంలోకి వస్తే బెల్ట్ షాపులు ఎత్తి వేస్తాం, రూపాయి ఖర్చు లేకుండా ఉచిత వైద్యం : ఈటల రాజేందర్

కార్పొరేషన్ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులను ఓడించాలని నారాయణ తనకు రూ.50 లక్షలు ఇంటికి పంపితే.. తిరిగి పంపానని చెప్పారు. గంజాయిలో దొరికిన వారందరూ… టీడీపీ నేతలు, తెలుగు యువత, తెలుగు మహిళలేనని ఆరోపించారు. తనపై ఎలాంటి క్రికెట్ బెట్టింగ్ కేసుల్లేవని.. బెట్టింగ్ కేసులు ఉన్న ఎమ్మెల్యే లోకేష్ పక్కనే ఉన్నారని తెలిపారు. తమ పార్టీ నుంచి వెళ్లిన ఓ ఎమ్మెల్యేనే అవినీతి పరుడని విమర్శించారు.