ఏపీకి రాజధాని విశాఖే.. ఆపే శక్తి ఎవరికి లేదు : విజయసాయి రెడ్డి ధీమా

  • Publish Date - April 21, 2020 / 07:44 AM IST

ఏపీలో వైసీపీ, బీజేపీ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఏపీ ప్రభుత్వం దక్షిణ కొరియా నుంచి ర్యాపిడ్ టెస్టు కిట్లను కొనుగోలు వ్యవహారమే వైసీపీ, బీజేపీ మధ్య యుద్ధానికి కారణమైంది. చత్తీస్ గఢ్ టెస్టు కిట్లను రూ.337లకే కొనుగోలు చేస్తే.. ఏపీ ప్రభుత్వం రూ.730లకు కొనుగోలు చేసిందని ప్రతిపక్షాలు విమర్శలకు దిగాయి. బీజేపీకి చెందిన కన్నా, సుజనా చౌదరిలపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు విజయసాయి రెడ్డి. 

ఈ సందర్భంగా ఆయన విశాఖకు రాజధాని తరలింపుపై మీడియా సమావేశంలో మాట్లాడారు. విశాఖకు రాజధాని వచ్చి తీరుతుందని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి స్పష్టం చేశారు. రాజధాని తరలింపును ఎవరూ ఆపలేరన్నారు. రాజధాని తరలింపు ఎప్పుడు అనేది త్వరలో నిర్ణయిస్తామని విజయ సాయి చెప్పారు.

విశాఖకు రాజధాని తరిలిపోతుందని, దాన్ని ఆపే శక్తి ఎవరికి లేదని తెలిపారు. రాజధానిని విశాఖకు మార్చాలని నిర్ణయించడం జరిగిందని ఆయన అన్నారు. మండలం, జిల్లా అయినా రాజధానితో వాటికి సంబంధం లేదని స్పష్టం చేశారు.

ఇప్పటికే విశాఖకు రాజధానిని తరలించే విషయంలో అన్ని ఏర్పాట్లు జరిగిపోయాయని చెప్పుకొచ్చారు. లాక్ డౌన్ ఎత్తివేయడమే ఆలస్యం.. విశాఖకు రాజధాని తరలిపోవడం ఖాయమే అన్నట్టు విజయసాయిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. 

ట్రెండింగ్ వార్తలు