ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలు జిల్లాలను గడగడలాడిస్తున్న కరోనా ఉత్తరాంధ్రలోని ఆ రెండు జిల్లాలపై కరుణ చూపిస్తోంది. అభివృధ్ధిలో వెనుకబడిన విజయనగరం జిల్లా కరోనా వ్యాప్తి నియంత్రణలో ముందంజలో ఉంది. జిల్లాలో ఇంతవరకు ఒక్క కరోనా పాజిటివ్ కేసు కూడా నమోదు కాకపోవటమే ఇందుకు కారణం.
రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 180 పాజిటివ్ కేసులు నమోదైనప్పటికీ శ్రీకాకుళం,విజయనగరం జిల్లాల్లో ఇంతవరకు ఒక్క పాజిటివ్ కేసు నమోదు కాకపోవటంతో ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు.
విజయనగరంజిల్లాకు విదేశాలనుంచి 476 మంది వచ్చారు. వీరిలో క్వారంటైన్ పూర్తి చేసుకున్నవారు 133 మంది ఉన్నారు. అలాగే వలసకార్మికులు కూడా సుమారుగా 109 మంది ఉన్నారు వీరందిరనీ ప్రభుత్వం క్వారంటైన్ కేంద్రాలకు తరలించింది. వీరిలో 14 మందికి కరోనా లక్షణాలు గుర్తించి పరీక్షలు నిర్వహించగా 13 మందికి నెగెటివ్ రిపోర్టులు వచ్చాయి. మరోక రిపోర్టు రావాల్సి ఉంది.
నెల్లిమర్ల లోని నిమస్ ఆస్పత్రి, జెఎన్టీయూకళాశాల ప్రాంగణలో క్వారంటైన్ సెంటర్లు ఏర్పాటు చేసి అవసరమైన వైద్య సహయం అందిస్తున్నారు. జిల్లాలో గ్రామీణ ప్రాంతం ఎక్కువగా ఉండటంతో కూడా వైరస్ వ్యాప్తి తక్కువగా ఉందని తెలుస్తోంది.
కొత్తవారు గ్రామంలోకి వస్తేవారి వివరాలు ప్రజలు అధికారులకు అందిస్తున్నారు. వివిధ శాఖల అధికారుల సమన్వయంతో, ప్రజల సహకారంతో అనుమానితులను వెంటనే గుర్తించి వారిని క్వారంటైన్ కు తరలించటంతో ఇప్పటి వరకు ఒక్క పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదు.
See Also | ఆ హాస్పిటల్‌లోని డాక్టర్లు,నర్సులతోసహా 108మంది క్వారంటైన్‌కి…