Tiger
Tiger : కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలం పోలవరపుపాలెం, పొడపాక గ్రామల మధ్య సంచంరించిన పులి ఇప్పుడు తన స్ధావరాన్ని మార్చింది. అక్కడ నుంచి తన స్ధావరాన్ని పాండవులపాలెం, పుదిరిపాక వైపు మార్చంది. అటవీశాఖ అమర్చిన సీసీటీవీ కెమెరాల్లో సుమారు రెండు గంటలపాటు పులి సంచారం రికార్డయ్యింది. పులిని పట్టుకోటానికి అటవీ శాఖ అధికారులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు.
విశాఖ, ఉమ్మడి తూర్పుగోదావరి,విజయనగరం సరిహద్దు జిల్లాలోని అటవీ ప్రాంతంలో పులి సంచారంతో గత 12 రోజులుగా ఆయా గ్రామాల్లోని ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా పోయింది. పులిని బంధించటానికి నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ అనుమతి ఇచ్చింది. పులి సంచారాన్ని గుర్తిస్తున్నా పులిమాత్రం అధికారులుక చెమటలు పట్టిస్తోంది.
ఒకప్పటి టైగర్ కారిడార్ సుదీర్ఘకాలం తర్వాత పులి కనిపించిందనే సంతోషం కన్నా పులికి ఎలాంటి ఆపదరాకుండా కాపాడాలని అధికారులు తిప్పలు పడుతున్నారు. గురువారం ఒక ఆవుపై దాడి చేసి చంపేసింది. అనంతరం పులి పోలవరం ఎడమ కాల్వలో నీటిని తాగటానికి వచ్చినట్లు అధికారులు గుర్తించారు.
Also Read : Weather Update: నాలుగు రోజుల తరువాతే తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు: అప్పటి వరకు మండే ఎండలే