NTR 100 Rupees Coin Release: ఎన్టీఆర్ శతజయంతి స్మారక నాణెం విడుదల చేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు శతజయంతి సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ముద్రించిన 100 రూపాయల స్మారక నాణేన్ని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము విడుదల చేశారు.

NTR 100 Rupees Coin Release

NTR 100 Rupees Coin: దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు శతజయంతి సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ముద్రించిన 100 రూపాయల స్మారక నాణేన్ని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము విడుదల చేశారు. సోమవారం రాష్ట్రపతి భవన్ సాంస్కృతిక కేంద్రంలో ఈ కార్యక్రమం జరిగింది. తొలుత ఎన్టీఆర్ జీవిత విశేషాలతో కూడిన ప్రత్యేక వీడియోను ప్రదర్శించారు. అనంతరం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము  నాణేన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఎన్టీఆర్ స్మారక నాణెంను విడుదల చేయడం ఆనందంగా ఉందని తెలిపారు. భారతీయ సినిమా చరిత్రలో ఎన్టీఆర్ ఎంతో ప్రత్యేకం అని, రాముడు, కృష్ణుడు రూపాలను ప్రజలు ఎన్టీఆర్‌లో చూసుకున్నారని అన్నారు. భారత చలనచిత్ర రంగం ఉన్నతిలో ఎన్టీఆర్ పాత్ర కీలకం అని రాష్ట్రపతి కొనియాడారు. రాజకీయాల్లోనూ ఎన్టీఆర్ తన ప్రత్యేక చాటుకున్నారని చెప్పారు. ఎన్టీఆర్ విలక్షణ వ్యక్తిత్వాన్ని ప్రజలు ఎప్పటికీ మర్చిపోలేరని అన్నారు.

NTR 100 Rupees Coin: ఎన్టీఆర్‌ స్మారక నాణెం విడుదల.. ఢిల్లీకి చేరిన చంద్రబాబు, పురంధరేశ్వరి.. ఎవరెవరు పాల్గొంటున్నారంటే

పురంధేశ్వరి మాట్లాడుతూ.. వచ్చే తరాలకు ఎన్టీఆర్ ఆదర్శం అన్నారు. రాజకీయాల్లో పేదల అభ్యున్నతికి ఎన్టీఆర్ కృషిచేశారని అన్నారు. మహిళలకోసం ప్రత్యేక యూనివర్శిటీ ఏర్పాటు చేశారని, మహిళలకు ఆస్తిలో సమాన హక్కు కల్పించారని అన్నారు. స్మారక నాణెం విడుదల ఎన్టీఆర్‌కు దక్కిన గొప్పగౌరవంగా భావిస్తున్నట్లు తెలిపారు. ఎన్టీఆర్ రామాయణ, మహాభారతాలకు సంబంధించిన అనేక పాత్రల్లో జీవించారని, మనుషులంతా ఒక్కటే అనే సందేశాన్ని తన సినిమాల్లో ఇచ్చారని పురందేశ్వరి అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో పాటు నందమూరి బాలకృష్ణ, దగ్గుబాటి వెంకటేశ్వరరావు, చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి, నారా బ్రాహ్మిణితో పాటు ఎన్టీఆర్ కొడుకులు, కుమార్తెలు, కుటుంబ సభ్యులు, రాజకీయ, సినీ రంగాల ప్రముఖులు పాల్గొన్నారు.

Jr NTR : ఎన్టీఆర్ నాణెం విడుదల.. ఈ కార్యక్రమానికి కూడా జూనియర్ ఎన్టీఆర్ హాజరు అవ్వట్లేదు..?

ఈ కార్యక్రమానికి జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ లు హాజరుకాలేదు. జూనియర్ ఎన్టీఆర్  దేవర సినిమా షూటింగ్ కారణంగా వెళ్లలేదని తెలిసింది. ఇదిలాఉంటే..  ఎన్టీఆర్ 100 రూపాయల స్మారక నాణేన్ని 50శాతం వెండి, 40శాతం రాగి, ఐదు శాతం నికెల్, ఐదు శాతం జింక్‌తో హైదరాబాద్ మింట్ కాంపౌండ్‌లో ఈ నాణెంను తయారు చేశారు. అయితే,

ట్రెండింగ్ వార్తలు