Papikondalu Tour : పాపికొండలు విహారయాత్రకు గ్రీన్‌సిగ్నల్.. 20రోజుల తరువాత పున: ప్రారంభం..

Papikondalu Tour : పాపికొండలు విహారయాత్రకు ఆధికారులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. శనివారం నుంచి విహారయాత్రను పునరుద్దరిస్తూ అనుమతులు మంజూరు చేశారు.

Papikondalu Tour

Papikondalu Tour : పాపికొండలు విహారయాత్రకు ఆధికారులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. శనివారం నుంచి విహారయాత్రను పునరుద్దరిస్తూ అనుమతులు మంజూరు చేశారు. ఈ క్రమంలో పోలవరం జిల్లా దేవీపట్నం మండలంలో గండిపోశమ్మ ఆలయం నుంచి బయలుదేరేందుకు 15 ప్రైవేట్ బోట్లు, ఒక ఏపీటీడీసీ బోటు సిద్ధమయ్యాయి.

Also Read : ED Auctions Seized Aircraft : దేశంలోనే తొలిసారి.. విమానాన్ని వేలం వేసిన ఈడీ.. ఎంతకు విక్రయించారంటే?

దాదాపు 20రోజులు తరువాత పాపికొండలు విహారయాత్ర పున:ప్రారంభం కానుంది. జూన్ 14వ తేదీన పోశమ్మగండి నుంచి గోదావరిలో విహారయాత్రకు బయలుదేరిన ఓ పర్యాటక బోటు దేవీపట్నం పోలీసు స్టేషన్ సమీపంలోకి వెళ్లేసరికి సాంకేతిక లోపం తలెత్తడంతో నిలిచిపోయిన విషయం తెలిసిందే. బోటు అడుగుభాగంలో ఉండే ఇంపెల్లర్ (ఫ్యాను)కు చేపల వల చిక్కుకొని నిలిచిపోయింది. ఈ క్రమంలో బోటులోని ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. కొద్దిసేపటి తరువాత బోటుకు తలెత్తిన సమస్య తొలగిపోవడంతో ఒడ్డుకు చేరుకున్నారు.

అయితే, ఈ విషయం మరుసటి రోజు వెలుగులోకి వచ్చింది. దీంతో అధికారులు అప్రమత్తమై పాపికొండల విహారయాత్రను తాత్కాలికంగా నిలిపివేశారు. ఆ తరువాత అధికారులు అన్ని బోట్లను తనిఖీ చేశారు. తాజాగా.. మళ్లీ పాపికొండల విహారయాత్రకు అనుమతి ఇచ్చారు. దీంతో శనివారం నుంచి విహారయాత్ర ప్రారంభం కానుంది.

ఆంధ్రప్రదేశ్​ పర్యాటక శాఖకు చెందిన ఒక ప్రభుత్వ బోటుతో పాటు, ప్రైవేటు రంగానికి చెందిన మరో 15 పర్యాటక బోట్లు ఎప్పుడూ అందుబాటులో ఉంటాయి. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల నుంచి పర్యాటకులు పాపికొండలు విహారయాత్రకు వస్తుంటారు.