M Hari Narayanan : తుఫానును ఎదుర్కొనేందుకు అధికారులు సమాయత్తం కావాలి : జిల్లా కలెక్టర్

లోతట్టు ప్రాంతాలపై రెవెన్యూ అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని తెలిపారు. వైద్య ఆరోగ్యశాఖ, విద్యుత్ శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

M Hari Narayanan

M Hari Narayanan : తుఫానును ఎదుర్కొనేందుకు అధికారులు సమాయత్తం కావాలని నెల్లూరు జిల్లా కలెక్టర్ ఎం హరి నారాయణన్ అన్నారు. తుఫాను నేపథ్యంలో డిసెంబర్ 3,4,5 తేదీల్లో అధికారులందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎలాంటి పరిస్థితి నైనా ఎదుర్కోవడానికి సంసిద్ధంగా ఉండాలన్నారు. ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం లేకుండా అన్ని ముందస్తు చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు.

తుఫాను అనంతరం చేపట్టాల్సిన నివారణ చర్యలపై సిద్ధంగా ఉండాలని తెలిపారు. కలెక్టరేట్ లో ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. 1077 కాల్ సెంటర్ 24 గంటలు పనిచేసేలా సిబ్బందిని నియమించామని వెల్లడించారు. డివిజన్ కేంద్రాల్లో కూడా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. అధికారులు, సిబ్బందికి సెలవులు రద్దు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

Vijayasai Reddy : యువగళమా లేక స్కూలు పిల్లల్లో బానిస భావాలు పెంచే కార్యక్రమమా : విజయసాయి రెడ్డి

మత్స్యకారులేవరూ కూడా సముద్రంలోకి వేటకు వెళ్లకుండా అప్రమత్తం చేయాలన్నారు. లోతట్టు ప్రాంతాలపై రెవెన్యూ అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని తెలిపారు. వైద్య ఆరోగ్యశాఖ, విద్యుత్ శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ముంపునకు గురయ్యే ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించి పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయాలన్నారు.

ఇరిగేషన్ అధికారులు ప్రధానంగా సోమశిల, కండలేరు జలాశయాలపై పూర్తి పర్యవేక్షణ ఉంచాలని తెలిపారు. ఎప్పటికప్పుడు నీటి నిల్వలను పరిశీలిస్తూ ఉండాలని చెప్పారు. అల్లూరు, కలిగిరి, గండిపాలెం, రాళ్లపాడు, సర్వేపల్లి చెరువుల్లో నీటి ప్రవాహం పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. రైతులు నష్టపోకుండా వ్యవసాయ, ఉద్యానవన పంటల గురించి తగిన సూచనలు చేయాలని తెలిపారు.

ట్రెండింగ్ వార్తలు