Vijayasai Reddy : యువగళమా లేక స్కూలు పిల్లల్లో బానిస భావాలు పెంచే కార్యక్రమమా : విజయసాయి రెడ్డి

అమ్మ ఒడి దండగ అని రాళ్లు విసిరిన వ్యక్తి లోకేష్ అని విమర్శించారు. వాళ్ల చదువుల గురించి లోకేష్ కు కొంచెం అయినా బాధ్యత ఉందా అని ప్రశ్నించారు.

Vijayasai Reddy : యువగళమా లేక స్కూలు పిల్లల్లో బానిస భావాలు పెంచే కార్యక్రమమా : విజయసాయి రెడ్డి

Vijayasai Reddy (1)

Updated On : December 2, 2023 / 7:54 PM IST

Vijayasai Reddy – Nara Lokesh : టీడీపీ నేత నారా లోకేష్ పై వైసీపీ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా విమర్శలు చేశారు. యువగళమా లేక స్కూలు పిల్లల్లో బానిస భావాలు పెంచే దరిద్రపు కార్యక్రమమా అని లోకేశ్ ను ప్రశ్నించారు. వాళ్లు తొడుక్కున్న యూనిఫాం లోకేష్ ఇచ్చింది కాదన్నారు.

అమ్మ ఒడి దండగ అని రాళ్లు విసిరిన వ్యక్తి లోకేష్ అని విమర్శించారు. వాళ్ల చదువుల గురించి లోకేష్ కు కొంచెం అయినా బాధ్యత ఉందా అని ప్రశ్నించారు. పసిపిల్లలతో పాదాలకు నమస్కారాలు పెట్టించుకోవడం అమానవీయం కాదా అని నిలదీశారు. ఈ మేరకు విజయ సాయిరెడ్డి ట్వీట్ చేశారు.

Jawahar Reddy : విభజన చట్టం నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న తెలంగాణ : ఏపీ సీఎస్ జవహర్ రెడ్డి

నారా లోకేష్ యువగళం పాదయాత్ర 215 వ రోజు కొనసాగుతోంది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కొనసాగుతోంది. కాకినాడ గ్రామీణ మండలం తిమ్మాపురం నుంచి పాదయాత్రగా బయల్దేరిన లోకేష్ కు అడుగడుగునా జనం నీరాజనం పలికారు. టీడీపీ, జనసేన నాయకులు పెద్ద ఎత్తున తరలివచ్చి లోకేష్ వెంట నడుస్తున్నారు. పిఠాపురం నియోజకవర్గంలో పాదయాత్ర కొనసాగుతోంది.

పిఠాపురం ఉప్పాడ సెంటర్ లో నారా లోకేష్ యవగళం పాదయాత్ర బహిరంగ సభ రద్దైంది. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. గొంతు నొప్పి తీవ్రంగా ఉండటంతో లోకేష్ బహిరంగ సభ రద్దు చేసుకున్నారు. రేపు ఉప్పాడ కొత్తపల్లి సెంటర్ లో లోకేష్ ప్రసంగించనున్నారు.