Jawahar Reddy : విభజన చట్టం నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న తెలంగాణ : ఏపీ సీఎస్ జవహర్ రెడ్డి

రాష్ట్ర తాగునీటి అవసరాలకు నీరు విడుదలకు పలుమార్లు విజ్ఞప్తి చేసినా తెలంగాణ ప్రభుత్వం పట్టించుకోని కారణంగానే ప్రస్తుత పరిస్థితులు నెలకొన్నాయని తెలిపారు.

Jawahar Reddy : విభజన చట్టం నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న తెలంగాణ : ఏపీ సీఎస్ జవహర్ రెడ్డి

AP CS Jawahar Reddy

AP CS Jawahar Reddy : ఏపీ, తెలంగాణ రాష్ట్రాల అధికారులతో ఢిల్లీ నుండి కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కృష్ణా జలాల పంపకం వివాద పరిష్కారం, నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల నిర్వహణ, కృష్ణానది నీటి యాజమాన్య బోర్డు ద్వారా నిర్వహణ, నాగార్జున సాగర్ వద్ద నెలకొన్న ఉద్రిక్తతల అంశాలపై చర్చించారు. డిసెంబర్ 6న ఢిల్లీలో నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల నిర్వహణపై ఏపీ, తెలంగాణ రాష్ట్రాల సీఎస్ లు, ఇతర అధికారులతో సమావేశం నిర్వహించాలని కేంద్ర జల శక్తిశాఖ నిర్ణయించింది.

కేంద్ర జలశక్తి శాఖ సమావేశంలో ఏపీ సీఎస్ జవహర్ రెడ్డి పాల్గొన్నారు. నాగార్జున సాగర్ దగ్గర పరిస్థితులను వివరించారు.
విభజన చట్టంలో పేర్కొన్న నిబంధనలకు విరుద్ధంగా తెలంగాణ వ్యవహరింస్తోందని ఏపీ సీఎస్ జవహర్ రెడ్డి అన్నారు. రాష్ట్ర తాగునీటి అవసరాలకు నీరు విడుదలకు పలుమార్లు విజ్ఞప్తి చేసినా తెలంగాణ ప్రభుత్వం పట్టించుకోని కారణంగానే ప్రస్తుత పరిస్థితులు నెలకొన్నాయని తెలిపారు.

Telangana : ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ చెల్లించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్

డిసెంబర్ 6వ తేదీన జరిగే సమావేశంలో ఇందుకు సంబంధించి అన్ని అంశాలను దృష్టికి తీసుకొస్తామని వెల్లడించారు. ప్రస్తుతం హైదరాబాదులో ఉన్న కృష్ణా నది యాజమాన్య బోర్డు కార్యాలయాన్ని విశాఖపట్నంకు మార్చేలా కేఆర్ఎంబీకి ఆదేశాలు జారీ చేయాలని కోరారు. అందుకు అవసరమైన స్థలాన్ని ఇప్పటికే గుర్తించి ఉంచామని తెలిపారు.